Suryaa.co.in

Telangana

ఖమ్మం అభివృద్ధికి చిరునామా తుమ్మల

ఆయన పేరు తెలియని వారు ఆ జిల్లాలో ఎవరూ ఉండకపోవచ్చు. ఖమ్మం జిల్లా అంటే తుమ్మల. తుమ్మల అంటే ఖమ్మం. పదవులు ఉన్నా లేకపోయినా తుమ్మల నిత్యం జనంలోనే ఉంటారు. ఏదైనా ఉన్నదున్నట్లు కుండబద్దలు కొడతారు. ఇప్పటి ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధికి ఆయనే చిరునామా. రాజసం, హుందాతనం ఆయన మార్కు. ఆయన చూడని పదవులు, చూడని అధికారం లేదు. అధికారంతో సంబంధం లేకుండా.. ప్రజల్లో మమేకమయ్యే అతికొద్ది నేతల్లో ఒకరయిన, తుమ్మల నాగేశ్వరరావు జన్మదిన వేడుకలు ఉమ్మడి జిల్లాలో ఘనంగా జరిగాయి. ఆ వేడుకలకు హాజరయిన జనం, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ఆయన చేసిన సేవలు గుర్తు చేసుకున్నారు. దటీజ్ తుమ్మల.
ఉమ్మడి జిల్లా అభివృద్ధి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చలవేనని జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు, టీఆర్‌ఎస్‌ మండల పార్టీ అధ్యక్షుడు దొడ్డాకుల రాజేశ్వరరావు అన్నారు. తుమ్మల నాగేశ్వరరావు జన్మదినోత్సవం సందర్భంగా మండలంలో పలుగ్రామాలలో సోమవారం కార్యకర్తలు, అభిమానులు కేక్‌కట్‌ చేశారు. స్థానిక దేవాలయాల్లో తుమ్మల పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాచారం నరసింహాస్వామి ఆలయంలో యెల్లిన రాఘవారావు, మురళి ఆద్వర్యంలో ప్రత్యేక పూజలు, మొక్కలు నాటారు. ఆయా కార్యక్రమాలలో ఎంపీపీ సోయం ప్రసాద్‌, వైస్‌ ఎంపీపీ దారా మల్లికార్జునరావు, కోటగిరి బుజ్జిబాబు, జారె ఆదినారాయణ, ఆత్మాకమిటీ చైర్మన్‌ కేవీ సత్యనారాయణ, ఏఎంసీ ఉపాధ్యాక్షుడు కొయ్యల అచ్యుతరావు, టీఆర్‌ఎస్‌ యవత జిల్లానాయకులు కాసాని నాగప్రసాద్‌, దారా యుగంధర్‌, దమ్మపేట సర్పంచ్‌, ఉయ్యాల చిన వెంకటేశ్వరరావు, పోతినేని శ్రీరామ వెంకట్రావు, గోపిశాస్ర్తి, మాజీ ఎంపీపీ అల్లం వెంకమ్మ, మాజీ జడ్పీటీసీ దొడ్డాకుల సరోజిని, దొడ్డా రమేష్‌, రావు గంగాధరావు, వసంతరావు, ఒబులశెట్టి శ్రీను, రాయల నాగేశ్వరరావు, ప్రభాకర్‌, మాజీ ఎంపీటీసీ మన్నెం అప్పారావు, ఎంపీటీసి మన్నెం విజలక్ష్మి, అడపా రాంబాబు, అబ్దుల్‌ జిన్నా, ఎర్రగొర్ల రాధాకృష్ణ, ఎంపీటిసి గూడపాటి వెంకట్రావు, కూకులకుంట రమేష్‌, వల్లభనేని విజయ్‌, ఆకుల కృష్ణారావు, ఎంపీటీసీ బుడే, బులుసు గోపి పాల్గొన్నారు.
మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు జన్మదిన వేడుకలను అశ్వారావుపేటలోని అమ్మాసేవాసదనంలో టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు సోమవారం ఘనంగా నిర్వహించారు. వినాయకపురం గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు బిర్రం వెంకటేశ్వరావు ఆధ్వర్యంలో వృద్ధాశ్రమంలో వేడుకలను జరిపారు. కేక్‌ కట్‌ చేసి వృద్దులకు మిఠాయిలు పంచారు. అనంతరం వృద్దులకు దుప్పట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు ఉప్పల సతీశ్‌, లోకం సాంబఽశివరావు, ఉప్పల మురళీ, చెన్నారావు, తిరుమలేశ్‌, మాజీ సర్పంచి పొట్టా రాజులు, అమ్మా సేవాసదనం నిర్వాహకురాలు అనసూయ పాల్గొన్నారు.
మాజీ మంత్రి, టీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు తుమ్మల నాగేశ్వరావు జన్మదిన వేడుకలను ఆపార్టీ చండ్రు గొండ మండల కమిటీ ఘనంగా నిర్వహించింది. పార్టీ అఽ ధ్యక్షుడు దారా బాబు ఆధ్వర్యంలో చండ్రుగొండలో కేక్‌ కట్‌ చేసి తుమ్మలకు శుభాకాక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తుమ్మలు నాగేశ్వరావు రాష్ట్రం, జిల్లాలో చేసిన అభివృద్ధిని పలువురు సీనియర్‌ నాయకులు గుర్తుచేసు కున్నారు. కా ర్యక్రమంలో పార్టీ కార్యదర్శి ఏడుకొండలు, సీనియర్‌ నా యకులు చీదళ్ల పవన్‌కుమార్‌, వెంకయ్య, రసూల్‌, గాదె శివప్రసాద్‌, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
ములకలపల్లి సెంటర్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు పుట్టిన రోజు వేడుకలను ని ర్వహించారు. ఈ కార్యక్రమంలో టీ ఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు మోరంపూడి అప్పారావు, కార్యదర్శి అంజి, పార్టీ సీనియర్‌ నాయకులు పర్వతనేని అమర్‌నాఽథ్‌, రైతు సమన్వయ అధ్యక్షుడు వెంక టేశ్వరరావు, సొసైటీ డైరెక్టర్‌ ప్రకాష్‌, మాజీ జడ్పీటీసీ అంజీ, బీసీ సెల్‌ శ్రీరాములు నాగేశ్వరరావు, సర్పంచ్‌ సుధీర్‌, సర్పంచ్‌ శ్రీను, నర్సింహారావు, ప్రవీణ్‌, సంపత్‌కుమార్‌ పాల్గొన్నారు.
స్నేహానికి మారుపేరు తుమ్మల: కొమ్మినేని వికాస్
మిత్రధర్మానికి తుమ్మల నాగేశ్వరరావు మారుపేరని, ఆయన మిత్రుడయిన కొమ్మినేని వికాస్ వ్యాఖ్యానించారు. ఒకప్పుడు వెనుకబడిన ఖమ్మం జిల్లా, ఇప్పుడు అభివృద్ధిలో మిగిలిన జిల్లాలతో పోటీ పడుతుంటే దానికి కారణం తుమ్మల విజనరీనే కారణమని స్పష్టం చేశారు. ప్రజలకు సేవ చేయాలన్న తుమ్మల తపన, ప్రణాళిక నేటి నేతలకు ఆదర్శం కావాలన్నారు. తుమ్మల నేతృత్వంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా మరింత అభివృద్ధి కావాలని వికాస్ ఆకాంక్షించారు.

LEAVE A RESPONSE