ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 4న ఏపీలో జరపనున్న పర్యటనలో పాలుపంచుకోవాలంటూ టాలీవుడ్ అగ్ర నటుడు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవిని కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ మేరకు చిరంజీవికి కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆహ్వానం పంపారు.
ఈ నెల 4న ఏపీకి రానున్న మోదీ… ఆజాదీ అమృత్ మహోత్సవ్‌లో భాగంగా భీమవరంలో జరగనున్న మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125 జయంతి వేడుకల్లో పాల్గొననున్నారు. ఇందులో భాగంగా భీమవరంలో అల్లూరి విగ్రహాన్ని మోదీ ఆవిష్కరించనున్నారు.