Suryaa.co.in

Telangana

కేంద్ర జలశక్తి మంత్రిని కలిసిన కిషన్ రెడ్డి

ఢిల్లీ: కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ను కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి ఇవాళ సాయంత్రం (బుధవారం సాయంత్రం 4.30 గంటలకు) ఢిల్లీలోని శ్రమశక్తి భవన్‌లో కలిశారు. ఈ సందర్భంగా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన గోదావరి-బనకచర్ల లింక్ ప్రాజెక్టు గురించి వీరిద్దరూ చర్చించారు.

ఈ గోదావరి-బనకచర్ల లింకు ప్రాజెక్టును మంత్రిత్వశాఖ నిబంధనలకు అనుగుణంగా పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని కిషన్ రెడ్డికి.. సీఆర్ పాటిల్ తెలియజేశారు. అన్ని భాగస్వామ్యపక్షాలతో చర్చించిన తర్వాత పారదర్శకమైన పద్ధతిలోనే ప్రాజెక్టుకు సంబంధించిన నిర్ణయం ఉంటుందన్నారు. ఈ విషయంలో ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగకుండా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సీఆర్ పాటిల్ భరోసా ఇచ్చారు.

LEAVE A RESPONSE