– గోదావరి-బనకచర్లపై ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్
– ఏపీ ప్రభుత్వం నిబంధనలకు విరుద్దంగా నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్ట్ పై సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం
– బనకచర్లపై అఖిలపక్ష రివ్యూ తర్వాత బిజెపి ఎంపీలు డీకే అరుణ, రఘునందన్ రావు
హైదరాబాద్: తెలంగాణకు అన్యాయం చేసే ఏ అంశాన్ని కూడా మేము ఒప్పుకోము. ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్ట్ విషయంలో తెలంగాణకు ఎలాంటి అన్యాయం జరుగుతోంది అన్న అంశాలపై ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిల పక్ష ఎంపీల సమావేశంలో బీజేపీ తరపున నేను, మెదక్ ఎంపీ రఘునందన్ పాల్గొనడం జరిగింది.
పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ సమావేశానికి హాజరు కావడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం తరపున తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో చర్చించిన విషయాలను బీజేపీ ఎంపీలుగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తం.
కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఇప్పటికే మా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి కలిసి వివరించారు. మున్ముందు తాము కూడా ఎంపీలుగా కేంద్ర మంత్రిని కలిసి తెలంగాణకు జరిగే అన్యాయాన్ని వివరిస్తాం. గోదావరి నదిలో తెలంగాణ వాటానీటి కేటాయింపుల్లో ఏ మేర వాడుకున్నాము? గోదావరి నదిపై పూర్తికావాల్సిన ప్రాజెక్టులెన్ని? ఎందుకు వాటిని పూర్తి చేయలేకపోయారు?
ఈ ప్రాజెక్టులు పూర్తిస్థాయి అనుమతులు తెచ్చే విషయంలో రాష్ట్ర ప్రభుత్వంగా మీవంతు ప్రయత్నం ఎందుకు చేయలేదు? అనే విషయాలపై వివరాలు అడిగాము. బనకచర్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం అన్ని అంశాలను పరిశీలిస్తోంది.