– డల్లాస్‌లో ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్
స్వరరాగావధానం ప్రక్రియ తెలుగువారి మహత్తర శక్తి అని విశ్వ హిందీ పరిషత్ అధ్యక్షుడు, పద్మ భూషణ్ ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు. అమెరికా – డల్లాస్‌లో తానా-టాంటెక్స్ సంయుక్త ఆధ్వర్యంలో అడుసుమిల్లి రాజేష్, దేవినేని పరమేష్ సమన్వయంలో గరికపాటి ప్రభాకర్‌చే స్వరరాగావధానం తెలుగు సాహితీ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా యార్లగడ్డ మాట్లాడుతూ, అవధానం తెలుగువారి సంపద అన్నారు. సాహిత్య అవధాన ప్రక్రియ తిరుపతి వేంకట కవులు, కొప్పరపు కవుల ద్వారా విశేష ప్రాచుర్యంలోకి వచ్చిందని, సంగీతం ద్వారా రాగాలను ఆధారం చేసుకుని స్వరరాగావధానం పేరిట సరికొత్తగా అవధాన ప్రక్రియను తీసుకురావడం అభినందించదగ్గ విషయమని కొనియాడారు. గరికపాటి ప్రభాకర్ ఈ ప్రక్రియను బహుళ ప్రాచుర్యంలోకి తీసుకుని వచ్చి, శిష్య బృందాన్ని తయారు చేయాలని సూచించారు. కార్యక్రమంలో డా. తోటకూర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.