Suryaa.co.in

Telangana

కేసీఆర్ కుటుంబానికి అధికారం తలకెక్కింది

ప్రధాని మోడీ టూరిస్టా?.. మీరే టూరిస్టులు
కేసీఆర్ ప్రగతి భవన్ లో ఉండేది కేవలం ఇంకో 2 నెలలే
కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి

కృష్ణా నది జలాలు, పసుపు బోర్డు, ట్రైబల్ యూనివర్సిటీపై ఒకేరోజు కేబినెట్ లో ఆమోదం పొందడం చరిత్రాత్మకం.చాలా సంతోషకరం.దీన్ని కూడా వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు.సమస్యలు పరిష్కరించాలని మోడీ ప్రయత్నిస్తున్నారు.. వీటికి తుది రూపం ఇచ్చారు.

మోడీ తెలంగాణ ప్రజల సెంటిమెంటును గౌరవించి సమ్మక్క సారలమ్మ పేరును ట్రైబల్ యూనివర్సిటీకి పెట్టారు.గిరిజన రిజర్వేషన్లు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం వారిని మోసం చేస్తోంది.గిరిజన వర్సిటీకి స్థలం కేటాయించకుండా తాత్సారం చేస్తోంది. వాళ్ళు ఇవ్వకపోయినా త్వరగా పూర్తి చేయాలని కేంద్రం భావిస్తోంది.ఇంకో 50 ఎకరాల స్థలానికి సంబంధించిన అంశం పెండింగ్ లో ఉంది.వర్సిటీకి భూముల కేటాయింపుపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు.

అద్దాల మేడలో కూర్చుని రాళ్లను విసిరితే మీ అద్దాలే పగులుతాయ్.మాటలే తప్ప చేతకాని దద్దమ్మ సర్కార్ కేసీఆర్ ది.గిరిజనుల పొట్ట కొడుతున్నారు. అబద్ధాలు ఆడటం.. ప్రజలను మభ్య పెట్టడంలో కల్వకుంట్ల కుటుంబం ఫస్ట్ ప్లేస్ లో ఉంది.ఈ కుటుంబానికి ఆస్కార్, నోబెల్ ఇవ్వవచ్చు. కృష్ణా ట్రిబ్యునల్ మీద కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు.

కేసీఆర్ ఫామ్ హౌజ్ లో కాళ్ళు బార్ల చాపుకుని కూర్చుంటారు తప్ప.. ప్రజలకు మంచి చేద్దామని లేదు.కేసీఆర్ కుటుంబానికి అధికారం తలకెక్కింది.మోడీ వచ్చి ఇక్కడ చేసేదేంటి? అని అహంకారపూరితంగా మాట్లాడుతున్నారు.ప్రధాని మోడీ టూరిస్టా?మీరే టూరిస్టులు.పరేడ్ గ్రౌండ్ కు రావడానికి కేసీఆర్ కు 10 నిమిషాలు కూడా పట్టదు.

మోదీ ఢిల్లీ నుంచి వచ్చినా కేసీఆర్ రాడు.బయ్యారం స్టీల్ ప్లాంట్ పై హామీ ఇచ్చింది మీరే.బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై హామీ ఇచ్చింది కూడా బీఆర్ఎస్ నేతలే.35 వేల కోట్లతో.. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పారు.వారి నిర్లక్ష్యం, అశ్రద్ధ కారణంగా, కమీషన్ల కోసం 57 వేల కోట్లకు వ్యయం పెరిగింది.

రేపు బీజేపీ స్టేట్ కౌన్సిల్ మీటింగ్.సుమారు 1000 మంది ముఖ్య నాయకులు తెలంగాణ వ్యాప్తంగా అన్ని మూలాల నుంచి వస్తారు.జేపీ నడ్డా ప్రారంభిస్తారు.తీర్మానాలు, చర్చలు, అసెంబ్లీ ఎన్నికల కార్యాచరణ రూపొందించుకుని ముందుకు వెళ్తాం.రేపటి ఎజెండాపై నేడు రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, ఇంచార్జీలతో భేటీ అయ్యాము.ఈనెల 10వ తేదీన అమిత్ షా తెలంగాణకు వస్తున్నారు. ఆదిలాబాద్ లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నాం.అగ్ర నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించే సభలపై నేడు నడ్డా సమక్షంలో చర్చిస్తాం.

తెలంగాణకు ముఖ్య నేతలంతా వస్తారు. మోడీ, నడ్డా, షా వస్తారు.అమిత్ షా 10, 27 తేదీల్లో వస్తారు.10న ఆదిలాబాద్, 27న కుత్బుల్లాపూర్ లేదా రాజేంద్రనగర్ లో ఉంటుంది. డిఫెన్స్ మినిస్టర్ రాజ్ నాథ్ సింగ్ ఈనెల 20, 21 తేదీల్లో తెలంగాణలో పర్యటిస్తారు.

గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లకు ఎంత నిధులు ఇచ్చారు.. అసిఫాబాద్ కు, ఇతర మారుమూల ప్రాంతాలకు ఎంత కేటాయించారు?కేసీఆర్ కుటుంబం అభద్రతా భావంలో ఉంది. ఆ కుటుంబం ప్రగతి భవన్ లో ఉండేది కేవలం ఇంకో 2 నెలలే. ఆ తర్వాత ఫామ్ హౌజ్ కు వెళ్లాల్సిందే. వంకర మనుషులు.. వంకరగానే.. మాట్లాడుతారు.

కంటోన్మెంట్ లో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కు 10 ఎకరాల స్థలం కేటాయించారు.. ఇదే ఆ రెండు పార్టీలు ఒకటే అని చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు.. ఇలాంటివి చాలా ఉదాహరణలు చాలా ఉన్నాయి.

ఆంధ్రప్రేదేశ్ రాష్ట్రంలో యూనివర్శిటీ మంజూరు అయింది. నిధులు కూడా మంజూరయ్యాయి.కాని, బీఆర్ఎస్ ప్రభుత్వం తమ దగ్గర తప్పు పెట్టుకుని అనవసర విమర్శలు చేయడం సిగ్గుచేటు. ట్రైబల్ యూనివర్శిటీకి భూసేకరణకు సంబందించి స్థలాన్ని గుర్తించాలని ఇప్పటివరకు 9 సార్లు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం లేఖలు రాసింది.రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ములుగులో గిరిజన యూనివర్శిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించి ప్రకటించింది.

రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వంతో కలిసి సమస్యలు పరిష్కరించుకోవాలనే ఆలోచన లేదు. జాతీయ రహదారులు, రైల్వే స్టేషన్ల అభివృద్ది, వందే భారత్ ట్రైన్ల ప్రారంభం, 800 మెగావాట్ల పవర్ ప్రాజెక్టు ప్రారంభోత్సవం, ఇతర అభివృద్ధి పనుల కోసం ప్రధాన మంత్రి రాష్ట్రానికి వస్తే … ముఖ్యమంత్రి ఫాంహౌస్ లో కూర్చుంటున్నడు.

తొమ్మిదిన్నరేళ్ల పాలనలో ఒక్కరోజు కూడా సెలవు తీసుకోని ఘనత ప్రధాని నరేంద్ర మోదీ గారిది. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఫాంహౌస్ కు పరిమితమైంది కేసీఆర్.దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వలేదు.. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించలేదు. ప్రజలకు ఇచ్చిన అనేక హామీలను నెరవేర్చలేదు.

బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీపై ప్రధాని మోదీ గారు ఏనాడు హామీ ఇవ్వలేదు. రెండోసారి ముఖ్యమంత్రి అయితే బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ పెడతామని చెప్పి మాటతప్పింది ముఖ్యమంత్రి కేసీఆర్. ఇచ్చిన హామీలను నెరవేర్చనందుకు కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యుల దిష్టిబొమ్మలు తగులబెట్టాలి. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఫీజుబుల్టి కాదు. గతంలో కేంద్రం చెప్పింది. ఇప్పుడు కూడా చెప్తున్నాం. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ని కేసీఆర్, కేటీఆర్ ఏర్పాటు చేస్తామంటూ మాటలు చెప్పారు. ఇప్పుడు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కేంద్రం ఎందుకు నిర్మించడం లేదు అంటున్నరు?

కేసీఆర్ మాటలు కోటలు దాటుతాయి… పనులు మాత్రం ఫాంహౌస్ దాటవు. కృష్ణా నదీ జలాల పంపిణీకి సంబంధించి ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్యన సమస్య పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తూ కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడం సంతోషంగా ఉంది.మన నీళ్లు-మన కొలువులు మనకేననే ఉద్యమ నినాదంతో తెలంగాణ ప్రజలు పోరాటం చేసి ప్రత్యేక తెలంగాణ సాధించుకున్నరు.కేసీఆర్ ప్రభుత్వం నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో పూర్తిగా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోంది.

ఉద్యోగ నియామకాల విషయంలో తెలంగాణ యువతకు వెన్నుపోటు పొడిచారు.కృష్ణా వాటర్ ట్రిబ్యునల్ కు సంబంధించి ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించి ప్రజలకు న్యాయం చేయాలి.పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తయిపోయి, పొలాలు సశ్యశ్యామలమైనట్లు బీఆర్ఎస్ ప్రభుత్వం నగరంలో హోర్డింగులతో ప్రచారాలు చేసుకుంటోంది.రూ. 35 వేల కోట్లతో ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ చేతగానితనం వల్ల రూ. 50 వేల కోట్లకు అంచనా వ్యయం పెరిగింది.పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పట్ల కేసీఆర్ నిర్లక్ష్యం వల్ల ప్రజలపై భారం పడుతోంది.

LEAVE A RESPONSE