బాబు, లోకేశ్‌లది శనిపాదం

Spread the love

– బాబు ఎక్కడ పాదం మోపినా చావులే..!
– బాబు పబ్లిసిటీ పిచ్చికి జనం బలి అవుతున్నారు
– బాబుకు బ్రహ్మరథం కాదు.. యమరథం
– “నారా”రూప రాక్షసుడు చంద్రబాబు
– కానుకల పేరిట మహిళలను బలిగొన్న దుర్మార్గుడు బాబు
– బాబు భార్య లాంటి వారే కాదా గుంటూరు సభకు వచ్చిన మహిళలు
– బాబును రాజకీయ సమాధి చేయకపోతే విధ్వంసాలు చేస్తాడు
– మాజీ మంత్రి కొడాలి నాని

చావులతో బాబు బోణీ
2022 చివరిలో కందుకూరులో ఇదేం ఖర్మ సభ పెట్టి 8 మంది చావుకు కారణమవ్వడం … నిన్న 2023 జనవరి 1న కానుకల పేరుతో సభ పెట్టి ముగ్గురు మహిళలను బలిగొన్న దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. బాబుకి పబ్లిసిటీ పిచ్చి. తనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని డ్రోన్ షాట్ల ద్వారా చూపించడానికి కందుకూరులోని ఇరుకు సందులో, డ్రైనేజీ గట్లపైన మీటింగ్‌ పెట్టి, ఆ రోడ్డును కూడా ఫ్లెక్సీలతో నింపేసి మరింత ఇరుకుగా మార్చేసి, వాహనమెక్కి మైఖేల్‌ జాక్సన్‌లా చంద్రబాబు మైకు పుచ్చుకుని జనాన్ని ఇంకా ముందుకు.. ఇంకా ముందుకంటూ వారిని ఇరుకు సందులోకి తీసుకెళ్లాడు. దాంతో తొక్కిసలాట జరిగి 8 మంది ప్రాణాలను బలిగొన్న దుర్మార్గుడు చంద్రబాబు. … అని మాజీ మంత్రి కొడాలి నాని మీడియా సమావేశంలో తూర్పారపట్టారు.

కానుకల పేరిట చావులు…
నిన్న గుంటూరులో చంద్రన్న కానుకల పేరుతో ప్రచారం చేసి, పేదమహిళలకు పట్టుచీరలు ఇస్తాం…ఏడాదికి సరిపడా కానుకలు ఇస్తామంటూ …ఎన్‌ఆర్‌ఐ ఉయ్యూరు ఫౌండేషన్‌ వాళ్లు 30 వేల మంది మహిళలకు స్లిప్పులు పంచారు. ఆదివారం మధ్యాహ్నం 1.30 ప్రాంతానికే పేదంతా వస్తే … బాబుకు బుద్ధి లేకుండా ఎండలో మహిళలు మాడిపోతున్నారని కూడా గుర్తించకుండా ఏసీ రూములో కూర్చుని, సాయంత్రం చల్లబడిన తర్వాత 5.30కు మైదానానికి వెళ్లాడని నాని దుయ్యబట్టారు. ఫౌండేషన్‌ వంటి సంస్థలు సభను పెట్టినప్పుడు తమ కార్యక్రమాలకు సంబంధించి మాట్లాడేలా చూస్తారు. ఇందుకు భిన్నంగాఈ సభను జగన్‌మోహన్‌ రెడ్డి ని తిట్టే కార్యక్రమంలా మార్చారు. 30 వేల మంది మహిళలు వచ్చారు. వారిలో ఓ నలుగురికి బాబు వేదికపై కానుకలు పంచి, తన దారిన తాను వెళ్లిపోయాడని నాని విమర్శించారు.

ఈ మరణాలకు బాధ్యుడు బాబే?
పనీ పాటా లేని ఆలపాటి రాజా లాంటి టీడీపీ నేతలు.. టోకెన్లు పట్టుకు రండి కానుకలు ఇస్తామంటే ఎక్కడ కానుకలు అందవోనని మహిళలంతా తోసుకుంటూ వెళ్లి, అందులో ముగ్గురు చనిపోతే దానికి బాధ్యుడు చంద్రబాబు కాదా? 40 ఏళ్ళ ఇండస్ట్రీ, 14 ఏళ్ళ ముఖ్యమంత్రి అని చెప్పే చంద్రబాబు- బుద్ధి, జ్ఞానం లేకుండా ఇలాంటి కార్యక్రమాలకు వెళ్ళి పేదల ప్రాణాలు తీస్తాడా? అని నాని ప్రశ్నించారు. ఒక ఫౌండేషన్‌ వారు.. 30 వేల మందికి కానుకలు ఇస్తామంటే … వారందరూ వస్తే ఎలా కంట్రోల్‌ చేయాలి? ఇవన్నీ అడగాల్సిన బాధ్యత చంద్రబాబుకు లేదా? అని నాని విమర్శించారు.

పోలీసు వైఫల్యం అంటూ బాబు, టీడీపీ దొంగ ఏడుపులు
సభల నిర్వహణలో మాకు 40 ఏళ్ల అనుభవముందని తెలుగుదేశం గొప్పలు చెబుతుంది. ఇలాంటి పిచ్చి కార్యక్రమాలు పెట్టింది చాలక ఇది ప్రభుత్వ వైఫల్యం, పోలీసు వైఫల్యమంటూ మాపై నిందలా? అదేమంటే.. తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు పోలీసులు ఆంక్షలు పెడుతున్నారంటూ బాబు, టీడీపీ నేతలు దొంగ ఏడుపులు.. ఇవన్నీ 420 కార్యక్రమాలు. టీడీపీ అధికారంలోకి వచ్చేస్తోందంటూ ఎక్కడో ఉన్న కొంతమంది బకరాలకు ఆశచూపడం, ఆ బకరాలకు నాలుగో, అయిదో సీట్లు ఇస్తానని చెప్పడం …వాళ్లు ఆ మాటలు నమ్మి ఈ బట్టలు పంచడం… 250, 300 రూపాయల విలువ చేసే చీరలు, అరకేజీ బెల్లం, పప్పు, ఉప్పు పంచడం జరిగింది. ఒక పది రోజులకైనా ఆ సరుకులు సరిపోతాయా? అని నాని వ్యాఖ్యానించారు. ఇది నూటికి నూరుపాళ్లూ బాబుకు పట్టిన పబ్లిసిటీ పిచ్చి. ఇది పోలీసుల వైఫల్యం కానేకాదు. బాబుకు 75 ఏళ్ల వయసులో మళ్లీ అధికారంలోకి రాకపోతే తెలుగుదేశం పార్టీ ఉండదు. అతని కొడుకు దేనికీ పనికిరాని పప్పు… …చవట దద్దమ్మ…సన్నాసి…అతనికి రాజకీయ భవిష్యత్తు ఉండదు. కాబట్టి ఏదో రకంగా జనాన్ని మభ్యపెట్టి, పబ్లిసిటీ చేసుకుని, పార్టీకేడర్‌లో తానేదో అధికారంలోకి వచ్చేస్తానని, కార్యకర్తలను కాపాడుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలను బాబు ఉపయోగించుకుంటున్నాడని నాని అన్నారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల తెలుగుదేశం కార్యకర్తలు, సామాన్య మహిళలు, ఎన్‌ఆర్‌ఐలు బలైపోతున్నారు.

ఎవరో ఒకరి కాళ్లు పట్టుకుని అధికారంలోకి…
బాబు తిన్నింటి వాసాలు లెక్కించే ద్రోహి. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి ఒకసారి, ఇంకోసారి వాజ్‌పేయి కాళ్లు పట్టుకుని, మరోసారి మోదీ, పవన్‌కళ్యాణ్‌ కాళ్లు పట్టుకుని, వాళ్ల బూట్లు నాకి అధికారంలోకి వచ్చాడు. చంద్రబాబు నాయుడు ఒక 420 . అతను వాగ్దానాలు చేసి, ఎప్పుడూ నెరవేర్చడని జనానికి తెలుసు. ఇలాంటి ఎన్ని కార్యక్రమాలు చేసినా బాబు అధికారంలోకి రాలేడని నాని కుండబద్దలు కొట్టారు.
చంద్రబాబు ప్రోగ్రాముల నిర్వహించే తీరు గురించి నెలరోజులుగా నేను చెబుతున్నా…అతను ఎక్కడ సభలు పెట్టినా ఇరుకు సందులను ఎంపిక చేసుకునే ఏర్పాటు చేస్తాడు. ఎయిర్‌పోర్టులో దిగిన వెంటనే ఆ పార్లమెంటు నియోజకవర్గంలోని 700 కార్లు ర్యాలీపెట్టాలి. ఎక్కడ సభ పెడతాడో అక్కడ 10 వేల మందిని సమీకరిస్తున్నారు. చంద్రన్న కానుకలు అంటూ …డబ్బులిచ్చి సభలకు జనాన్ని తెస్తున్నారు. దీనివల్ల ప్రమాదముంది, ఇలాంటి కుట్రలు చేస్తున్నాడని నేను పది రోజులుగా చెబుతున్నా. .రేపు కృష్ణా జిల్లా వచ్చినా, గుడివాడలో సభ పెట్టినా 700 కార్లతో ర్యాలీ, మరో 10వేల మందిని సమీకరిస్తారు. మెయిన్‌రోడ్లలో సభలు పెట్టడు. గుడివాడలో ఇరుకుసందుల్లో మీటింగ్‌ పెడతాడని నాని విమర్శించారు. ఇరుకు సందులనే బాబు ఎంపిక చేస్తాడు. అక్కడ బాబుకు బ్రహ్మరథం పట్టారని ప్రచారం చేసుకుంటాడు. అది బ్రహ్మరథం కాదు యమరథం. అతనిది, అతని కొడుకు లోకేష్ ది శనిపాదం.

ఆడి తప్పడమే బాబు నైజం….
జనానికి వచ్చే పింఛన్లు, సంక్షేమంలో కోతలు పెడతాడు. 2014 ఎన్నికల సందర్భంగా చేసిన వాగ్దానాల్లో డ్వాక్రా మహిళల రుణాలు రద్దు చేస్తామంటూ ప్రచారం చేసి, చేయలేదు. అతనొక కోతల రాయుడు… మహిళలకు సున్నావడ్డీకి రుణాలిస్తామని రూ. 11వేల కోట్లు వసూలు చేసి, రూ. 9400 కోట్లు పసుపు కుంకుమ కింద ఇచ్చాడు. అందుకే మహిళలు అతని మూతిపళ్లు రాలేలా కొట్టారు. రైతులకు రూ. 87 వేల కోట్లకు పైగా రుణమాఫీ చేస్తానని, బ్యాంకుల్లో తాకట్టు పెట్టుకున్న మహిళల మంగళ సూత్రాలు కూడా ఇంటికే తెచ్చిస్తానని చెప్పి, మోసం చేశాడు. దాంతో గత ఎన్నికల్లో రైతులు, మహిళలు ఓటు అనే ఆయుధంతో తన్నారు.  మొదటి సంతకం,రెండో సంతకం, మూడో సంతకంగా …బెల్టు షాపులు తీసేస్తానని ఎక్కడా వాటిని తీయకపోగా, బార్‌ రూములకు పర్మిట్లు ఇచ్చాడు. అతనొక చీటర్, దొంగ. బాబును జనం నమ్మితే చావు తప్ప ఇంకొకటి ఉండదు. అందుకే బాబు ఎక్కడ సభలు నిర్వహిస్తానని చెప్పినా, పబ్లిక్‌ ప్రదేశాల్లో ఎక్కడా అతనికి పర్మిషన్‌ ఇవ్వకూడదు. ఎందుకంటే తండ్రీ కొడుకులిద్దరు శనిగాళ్లు. లోకేష్‌ పాదయాత్ర అని ఉదయం 9 గంటలకు ప్రకటించగానే రాత్రి 9 కల్లా 8 మంది కందుకూరులో చనిపోయారు. ఆ 8 మంది కూడా టీడీపీ కార్యకర్తలే, ఆ పార్టీ సానుభూతిపరులేనని నాని విచారం వ్యక్తం చేశారు.

జామాతా దశమగ్రహం…
నిన్న జనవరి 1న.. ఎవరైనా శుభం కోరుకుంటారు. మంచి జరగాలని అనుకుంటారు. బాబు గుంటూరులో కాలు పెట్టగానే ముగ్గురు మహిళలు చనిపోయారు. జామాతా దశమగ్రహం…అని ఎన్టీఆర్‌ బాబుకు పేరు పెట్టారు. శనిగ్రహం కన్నా ఇది పవర్‌పుల్‌ గ్రహం. నారారూప రాక్షసుడు చంద్రబాబు. బాబు పెట్టే సభలకు మహిళలు కాని, ఇంకెవరైనా సరే అతను పెట్టే ఆశలకు లొంగొద్దని కోరుతున్నాను. బాబు ఎక్కడ సభలు పెడుతున్నాడో, ఎందరు వస్తారో , ఎన్ని కార్లతో ర్యాలీ చేస్తున్నాడో ముందే పోలీసులకు సమాచారం తెలియాలి. నీ పబ్లిసిటీ కోసం జనాన్ని చంపుతావా? అని నాని ప్రశ్నించారు. నీ భార్యను అసెంబ్లీలో ఏదో అన్నారని వెక్కి వెక్కి ఏడ్చావు. గుంటూరులో నీ సభకు వచ్చిన మహిళలు కూడా నీ భార్య వంటి స్త్రీలు కారా? నీ పిల్లలు, నీ కోడలితో సమానం కాదా? అంతమందిని ఎలా తీసుకొస్తావు? అయిదారు గంటలు వారిని ఎలా అక్కడ నిరీక్షించేలా చేస్తావా? కొందరికి కాళ్లు విరిగాయి. ముఖ్యంగా మహిళా మూర్తులు బాబుతో జాగ్రత్తగా ఉండాలి. 2024 ఎన్నికల్లో బాబును గొయ్యి తీసి కప్పెట్టాలి. రాజకీయ సమాధి చేయకపోతే ఈ రాష్ట్రంలో చాలా విధ్వంసాలు జరుగుతాయని నాని వ్యాఖ్యానించారు.

Leave a Reply