Suryaa.co.in

Andhra Pradesh

కోడెల శివప్రసాద్ జీవితం ఎందరికో ఆదర్శప్రాయం

– తెదేపా నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు

గొల్లపూడి: 4 దశాబ్దాల రాజకీయ జీవితంలో డాక్టర్ గా, హోమ్, పంచాయతీరాజ్, ఇరిగేషన్, వైద్య, పౌరసరఫరాల మంత్రిగా, స్పీకర్ గా పదవులుకే కోడెల శివప్రసాద్ వన్నెతెచ్చార న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు అన్నారు.

సోమవారం గొల్లపూడి కార్యాలయంలో ఆయన వర్ధంతిని పురస్కరించుకుని స్థానిక నేతలతో కలిసి కోడెల చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నలభై సంవత్సరాల తెలుగుదేశం పార్టీ రాజకీయ ప్రస్థానంలో స్వర్గీయ నందమూరి తారకరామారావు పిలుపు మేరకు రాజకీయాల్లోకి వచ్చి ఫ్యాక్షన్ కక్షలతో ఉన్న పల్నాడులో డాక్టర్ కోడెల శివ ప్రసాద్ రావు గారు అభివృద్ధికి బాటలు వేశారన్నారు.

పల్నాడు ప్రాంతంలో అతి తక్కువ ఖర్చు తో రూపాయి తీసుకోని పేదవాళ్లకు వైద్యం అందించి రూపాయి డాక్టర్ గా అందరి హృదయాల్లో పేరు తెచ్చుకున్నారన్నారు. కోడెల శివ ప్రసాద్ రావు గారు 1983, 85, 89, 94 మరియు 2014 నరసరావుపేట నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహించి ఐదుసార్లు శాసనసభ్యులుగా గెలుపొంది ఎన్టీ రామారావు క్యాబినెట్ లో హోం మంత్రిగా, చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో పని చేశారు. పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా, సివిల్ సప్లై శాఖ మంత్రి గా, ఇరిగేషన్ శాఖ మంత్రిగా కీలకమైన పదవుల్లో పని చేశారు అని గుర్తు చేశారు.

నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ కు స్పీకర్ గా ఆయన పాత్ర మరువలేనిది. 37 సంవత్సరాలు నిబద్ధతతో నిజాయితీగా రాజకీయాలు చేశారన్నారు. కావాలనే దురుద్దేశ పూర్వకంగా అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు తప్పుడు కేసులు పెట్టి తప్పుడు ఆరోపణలు చేసి ఆయనను మానసికంగా ఇబ్బంది పెట్టి మన మధ్య లేకుండా చేశారన్నారు. రాష్ట్రంలో ఏ మూలన కార్యకర్తకు సమస్య వచ్చినా ఆయన ముందుండి పరిష్కరించేవారన్నారు.

ఏదైతే ఎన్టీ రామారావు గారి ఆశయాన్ని చంద్రబాబు నాయకత్వంలో బసవతారకం ఆస్పత్రిని కట్టించి దేశ, విదేశాల నుంచి డాక్టర్లను తీసుకువచ్చి పేదవాడికి వైద్యం అందించేలా కృషి చేశారన్నారు. కోటప్పకొండ అనగానే డాక్టర్ కోడెల శివప్రసాద్ గుర్తుకు వస్తారన్నారు. నియోజకవర్గంలో స్మశాన వాటికలను అభివృద్ధి పరిచారన్నారు. అంతర్జాతీయ స్థాయిలో మహిళా పార్లమెంట్ పవిత్ర సంఘంలో ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున విజయవంతం చేసే దిశగా కృషి చేశారన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్లను పెద్ద ఎత్తున నిర్మించే క్రమంలో ఆయన పాత్ర కీలకమని గుర్తు చేశారు.

LEAVE A RESPONSE