Suryaa.co.in

Andhra Pradesh

కష్టకాలంలో పార్టీ వెన్నంటే ఉన్న వ్యక్తులు”పిల్లి”దంపతులు

– కూటమి ఐక్యతను దెబ్బతీసేందుకు కొన్ని శక్తులు పనిచేస్తున్నాయి
– మంత్రి వాసంశెట్టి సుభాష్

కాకినాడ రూరల్ : పార్టీ కష్ట కాలంలో కూడా ఎన్నో ఒడిదుడుకులు తట్టుకుని నిత్యం ప్రజల్లో ఉంటూ తెలుగుదేశం పార్టీ వెన్నంటే “పిల్లి” దంపతులు వున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక, ఫ్యాక్టరీలు, బాయిలర్స్,వైద్య బీమా సర్వీసెస్ శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ వలసపాకల లోని నియోజక కో ఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణ మూర్తి నివాసంలో మంత్రి వాసంశెట్టి సుభాష్ మర్యాద పూర్వకంగా భేటీ అయ్యి పిల్లి దంపతుల ఆశీస్సులు తీసుకున్నారు.

ఈ సందర్బంగా మంత్రి సుభాష్ పాత్రికేయులతో మాట్లాడుతూ… ప్రతి కుటుంబంలో గొడవలు ఉన్నట్టే నియోజవర్గంలో కూడా చిన్నచిన్న సమస్యలు ఉంటాయని అవి తమ దృష్టికి వచ్చాయని, ఆయా సమస్యలను వెనువెంటనే పరిస్కారం చేసే దిశగా పిల్లి దంపతులను కలవడం జరిగిందన్నారు.

తెలుగుదేశం,జనసేన ఐక్యతను విడదీసే విధంగా కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని, అందరు ఒకే పడవలో కలిసి ప్రయాణం చేసే విధంగా కృషి చేస్తున్నామని త్వరలోనే రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను కలవడం జరుగుతుందని తెలిపారు.

అనంతరం కో ఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ… కూటమి ఐక్యతను దెబ్బతిసే విధంగా కొంత మంది ప్రత్యర్థులు ఇబ్బందికర పరిస్థితులు సృష్టిస్తున్నారని, తమకు గాని స్థానిక ఎమ్మెల్యే పంతం నానాజీ కి గాని ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు లేవన్నారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE