Suryaa.co.in

Andhra Pradesh

జర్నలిస్టులు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులు

-జర్నలిస్టుల సంక్షేమo కోసం కృషి చేస్తాం
-జర్నలిస్టులు ప్రజల పక్షాన పోరాడాలి
-రాష్ట్ర ఆరోగ్య వైద్య శాఖ మంత్రివర్యులు సత్య కుమార్ యాదవ్, బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖా మంత్రి సవిత

పుట్టపర్తి : జర్నలిస్టుల సంక్షేమo కోసం కృషి చేస్తామని రాష్ట్ర ఆరోగ్య వైద్య శాఖ మంత్రివర్యులు సత్య కుమార్ యాదవ్, బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖా మంత్రి సవితమ్మ పేర్కొన్నారు. సోమవారం సత్యసాయి జిల్లా పుట్టపర్తి లోని సాయి ఆరామం ఫంక్షన్ హాల్ నందు ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో (APUWJ) జర్నలిస్ట్ ల సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ మాట్లాడుతూ జర్నలిస్టులు ప్రజల పక్షాన పోరాడాలని తెలిపారు, ప్రజాస్వామ్యవస్థలో పత్రిక రంగానికి నాలుగో స్తంభాన్నిగా గుర్తించడం జరిగిందని తెలిపారు. అర్హత కలిగిన ప్రతి జర్నలిస్టుకు త్వరలో అక్రిడేషన్ కార్డుల , హెల్త్ కార్డులు సంబంధించి సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రితో, డైరెక్టర్ తో, ఆరోగ్యశ్రీ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి పలు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

రాష్ట్రంలో 12,000 మంది జర్నలిస్టులో ఉన్నారని వారికి కుటుంబ సభ్యులకి అందరికీ హెల్త్ కార్డులు పంపిణీకి ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని వివరించారు. పత్రికా రంగం జవాబు దారి తనంతో ఉండాలని తెలిపారు ప్రతికూల వార్తలు రాసేటప్పుడు ఆలోచించి రాయాలని తెలిపారు, లేనిపోని వార్తలు రాసి ప్రజలను కన్ఫ్యూజన్ చేయకండి. నాలుగేళ్లలో 25 శాతం పనులు కూడా చేయకపోగా,16 శాతం బిల్లులు మాత్రమే చెల్లించిన జగన్ మోహన రెడ్డి మెడికల్ కాలేజీలో నిర్మాణంలో ఎంత చిత్తశుద్ధి ఉందో అర్ధం అవుతుందని పేర్కొన్నారు.

ఏపీలో 17 మెడికల్ కళాశాల నిర్మాణం చేస్తానని ఆర్భాటం చేసిన జగన్ వాటిపై నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించారు. ఫేస్ 2 కింద ఐదు మెడికల్ కాలేజీలో మదనపల్లి, ఆదోని, మార్కాపురం, పులివెందుల, పాడేరులో వైద్య కళాశాలలో ప్రారంభించి ఒక్కొక్క కళాశాలలో 150 సీట్లు చొప్పున 750 సీట్లు అదనంగా వైద్య శాఖ కసరత్తు చేసింది.

జాతీయ వైద్య కమిషన్ బృందం గత నెల జూన్ 24వ తేదీన మెడికల్ కళాశాలల పనులు తనిఖీ చేసి అసంతృప్తి వ్యక్తంచేసింది. ఆసుపత్రుల పనులు పూర్తయి అయినప్పటికీ మెడికల్ కళాశాల పనులు పెండింగ్ ఉండటంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో పాడేరు మెడికల్ కళాశాలకు లెటర్ ఆఫ్ పర్మిషన్ మంజూరు చేసింది. గత ప్రభుత్వం నిధులకు గండి కొట్టిందని తెలిపారు. బోధన సిబ్బంది నియామకాలు కూడా చేపట్టలేదు. పులివెందులలోని మెడికల్ కళాశాలలో సిబ్బంది కొరత ఉన్నదని తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జన్మదినోత్సవ సందర్భంగా ఆయనకు పలువురు అభినందనలు తెలిపారు.

బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖా మంత్రి సవిత మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజల కోసం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రతి వ్యక్తికి అందేలా జర్నలిస్టులు ప్రచారం చేయాలి. ప్రభుత్వం చేస్తున్నఅభివృద్ధిని తెలియజేయడంతోపాటు పాలనలో ఏవైనా లోపాలు ఉంటే వాటిని కూడా ప్రభుత్వానికి తెలియజేయవలసిన బాధ్యత ఉంది.

గత ప్రభుత్వంలో పలుచోట్ల జర్నలిస్టులపై జరిగిన దాడులు బాధాకరం. ఈ ప్రభుత్వంలో జర్నలిస్టులకు అన్ని విధాల రక్షణ కల్పించే బాధ్యత తీసుకుంటాం. జర్నలిస్టుల వెల్ఫేర్ ఫండ్ కోసం 100,116 రూపాయలు ప్రకటించిన మంత్రి సవితమ్మ గారు అదే విధంగా ,గత నెల క్రితం TV 5 కెమెరా మ్యాన్ చంద్ర శేఖర్ హార్ట్ స్ట్రోక్ తో చనిపోగా ఆ కుటుంబాన్నీ ఆదుకుంటామని, ఆ కుటుంబానికి 1,00,000 రూపాయలు అందచేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రతినిధులు, జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి గారు, ఎంపీ పార్థసారథి, మడకశిర ఎమ్మెల్యే MS రాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు .

LEAVE A RESPONSE