Suryaa.co.in

Andhra Pradesh

వరద బాధితులకు ఎమ్మెల్యే సౌమ్య వస్తువుల పంపిణీ

నందిగామ టౌన్: నందిగామ పట్టణం 16వ వార్డు పాత బైపాస్ గ్యాస్ కంపెనీ రోడ్డు నందు నందిగామ మాజీ సైనికులు వరద బాధితుల సహాయార్థం 60 మందికి నిత్యవసర సరుకులు, దుస్తులు మరియు పిల్లలకు పౌష్టికాహార బిస్కెట్లను ఇచ్చుటకు ముందుకు రాగా సోమవారం నాడు శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య ఎన్డీఏ కూటమి నేతలతో కలిసి బాధితులకు సరుకులు దుస్తులు మరియు పౌష్టికాహారం బిస్కెట్లను అందజేయడం జరిగింది.

ఈ సందర్భంగా తంగిరాల సౌమ్య మాట్లాడుతూ మానవసేవయే- మాధవసేవని ప్రకృతి వైపరీత్యంతో కొన్ని దశాబ్దాలుగా ఎన్నడు చూడని ఎదుర్కొని విపత్తును ఎదుర్కోవడం జరిగింది. ఇటువంటి సమయంలో వరద బాధితులకు సహాయం చేయడానికి ముందుకు వస్తున్న ప్రతి ఒక్కరిని పేరుపేరునా అభినందిస్తున్నాను. ఇటువంటి ఆపత్కర పరిస్థితులలో ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి ఎవరికి తోచిన విధంగా వారు వరద బాధితులకు సహాయం చేయాలని ఈ సందర్భంగా తంగిరాల సౌమ్య తెలియజేశారు.

LEAVE A RESPONSE