– బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్
అమలాపురం: అమలాపురం… కేరళ తరహా లో కోనసీమ ప్రాంతంలో అభివృద్ధి జరగాలని ఆ విధంగా ఎన్డీయే ప్రభుత్వం పనిచేస్తోందని బీజేపీ ఏపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ అన్నారు. సారథ్యం యాత్ర లో భాగంగా అమలాపురం లో ఛాయ్ పే చర్చ లో మాధవ్ మాట్లాడారు. కోనసీమ ప్రకృతి అందాల హరివిల్లు. కోనసీమ పర్యాటకంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. కోనసీమ ఎటువైపు చూసినా గోదావరి జీవ నది మరో వైపు సముద్ర తీరం ఈవిధమైన నేపథ్యంలో పర్యాటక రంగానికి ప్రాముఖ్యత ఇవ్వాలి.
కోనసీమ కు రైల్వే లైన్ లేక పోవడం దురదృష్టకరం. లోక్ సభ స్పీకర్ బాలయోగి సమయంలో రైల్వే లైన్ కు సర్వే జరిగింది. కొంకణ్ రైల్వే తరహా లో ఇక్కడ అభివృద్ధి చేస్తే బాగుంటుందని మాధవ్ అభిప్రాయపడ్డారు. కోనసీమ ప్రాంతం ప్రాచీన దేవాలయాలు నిలయం.టెంపుల్ టూరిజం విషయం లో దేవాదాయ ధర్మాదాయ శాఖ పని చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ అన్నీ స్వయం భూ దేవాలయాలు అందువల్ల దర్శనీయ క్షేత్రాలు కు భక్తులు వచ్చే పరిస్థితి ఉంటుంది అందువలన ఇక్కడ ఆదిశగా అభివృద్ధి జరగాలి.
మనం ఆత్మ నిర్భర్ భారత్ దిశగా అడుగులు వేయాలి. స్వదేశీ వస్తువు లు కొనుగోలు పెరగాలన్నారు.
వినాయక చవితికి మట్టి విగ్రహాలు కొనుగోలు చేస్తే స్థానికంగా మట్టి బొమ్మలు తయారీ దార్లను ప్రోత్సాహం చేయడం, పర్యావరణ పరిరక్షణ చేసిన వాళ్ళం అవుతాం. ఆటో కార్మికులను ఆదుకుంటాం. ముఖ్య మంత్రి చంద్రబాబు ఆదిశగా ప్రయత్నం చేస్తున్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఆటో డ్రైవర్ లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు… అయితే వారి సమస్యలు కూటమి ప్రభుత్వం పరిష్కారం చేస్తుందన్నారు.