రాష్ట్రంలో జగన్ రెడ్డి పరిపాలన కక్షపూరితంగా సాగుతోంది

-మాజీ మంత్రి కెఎస్ జవహర్

రాష్ట్రంలో జగన్ రెడ్డి పరిపాలన కక్షపూరితంగా సాగుతోంది. ప్రతీకారేక్షతో రగులుతోంది. తాలిబాన్ పరిపాలన కన్నా ఘోరంగా రాష్ట్రంలో పరిపాలన సాగుతోంది. అర్థరాత్రి టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబును అరెస్టు చేయడం అన్యాయం. ఎమ్మెల్సీగా ఉన్న అశోక్ బాబు ను ఒక దొంగ లాగ అరెస్టు చేయాల్సిన అవసరమేమొచ్చింది.

ముందు నోటీసులు ఇవ్వాలి. నోటీసులకు రాకపోతే అప్పుడు అరెస్టు చేయాలే తప్ప ఈ విధానం సరికాదు. జగన్ రెడ్డి పరిపాలనకు ఇదొక మచ్చు తునక. ప్రతీకారానికి ప్రతిరూపంగా జనగ్ వ్యవహరిస్తున్నారు. ఉద్యోగస్థుల ప్రయోజనాలను కాపాడుతున్న ఒక వ్యక్తిని అర్థాంతరంగా అరెస్టు చేయడమేంటి?. గతంలో
క్లోజ్ చేసిన కేసును తిరిగి రీ ఓపెన్ చేసి లోకాయుక్తను నియమించి లోకాయుక్త ద్వారా అరెస్టు చేయడం అన్యాయం. ఉద్యోగులు, ఉపాధ్యాయుల తరపున ఎవరూ ప్రశ్నించకూడదన్నదే జగన్ ఉద్దేశం.

ప్రశ్నిస్తే అరెస్టు చేయడమనే వైఖరిని జగన్ అవలంబిస్తున్నారు. అశోక్ బాబు ను బేషరతుగా విడుదల చేయకపోతే ఉద్యోగ, ఉపాధ్యాయులు ఆందోళనకు దిగుతారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీగా ఆయనను ఎలా కాపాడుకోవాలో మేం కాపాడుకుంటాం. లోకాయుక్త విషయంలో మీ పరిధి ఏంటి? వారి పరిధిని వారు గుర్తు పెట్టుకోవాలి. రిటైర్ మెంట్ మ్యాటర్ ను అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆయన ప్రమోషన్ పొందారా? పొందలేదా అని ఎంక్వైరీ చేస్తే సరిపోతుంది తప్ప ఇలా అరెస్టు చేయడం సరికాదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.

Leave a Reply