Suryaa.co.in

Andhra Pradesh

మద్యం ఆదాయాన్ని అనుచరులు, సామంతులకు కట్టబెడుతున్నారు

– మాజీ మంత్రి కేఎస్ జవహర్ 

జగన్ తన ప్రధాన ఆదాయ వనరు అయిన మద్యంపై వచ్చిన డబ్బును కేవలం అంతపురానికే కాకుండా తన అనుచర వర్గానికి, సామంతరాజులకు కట్టబెట్టాలని చూస్తున్నారు. అందుకు బార్ పాలసీని ఒక వేదికగా మార్చుకున్నారు. జగన్ రెడ్డి అధికారంలోకి రావడానికి మద్యపాన నిషేధం చేస్తానని వాగ్దానం చేశారు. ఆ వాగ్దానాన్ని తుంగలో తొక్కారు. జగన్ అధికారంలోకి రాకముందు మహిళల మెడలు తాళిబొట్లతో కళకళలాడాలన్నాడు, నేడు వెలవెలబోయేలా చేశాడు. ఏ మహిళకు అన్యాయం జరగకూడదని చెప్పారు. ఏ ఇంట్లో కూడా మద్యం ద్వారా చావులు రాకూడదని చెప్పి లెక్కలేనన్ని మరణాలు చవిచూస్తున్నాడు.

మద్యం పాలసీకి ఎన్ని తూట్లు పొడవాలో అన్ని తూట్లు పొడిచాడు. మద్యపాన నిషేధాన్ని ఒక మిథ్యగా మార్చాడు. మద్యపాన నిషేధాన్ని దాదాపు 25 సంవత్సరాల వరకు చేయలేని విధంగా చేశారు. వ్యవస్థను నిర్వీర్యం చేశాడు. ఇంతకాలం మద్యపాన నిషేధం పాలసీని పొడగించుకుంటూ వచ్చాడు. దీనికంటే మెరుగ్గా ఏ విధంగా డబ్బు సంపాదించాలి, తన అనుచరులకు ఏ విధంగా ఇవ్వాలని ఆలోచన చేసి బార్లకి లైసెన్సులు ఇవ్వడంతో సాధ్యమవుతుందని భావించాడు. ఇందుకోసం రేడింగ్ కి 1672 మంది వచ్చారు. 15వందల మంది అయినా రేడింగ్ లో ఉండాలికదా? కేవలం 11వందల మంది మాత్రమే మిగిలారు. 6 వందల మందికి వైసీపీ నాయకులు బెదిరించారు. రోడ్ల టెండరింగ్ లో కాంట్రాక్టర్లు ఏవిధంగా భయపడి పారిపోయారో అలాగే మద్యం విధానానికి భయపడి మిగతావారు కూడా పారిపోయారు.

వీరిలో పరిగణ సంస్థానాధీషులు ఉన్నారు. మున్సిపాలిటీ, కార్పొరేషన్, నగర పంచాయతీలకు శ్లాబు రేటు వేరువేరుగా పెట్టడం పిచ్చితుగ్లక్ పాలనకు అద్దం పడుతోంది. శ్లాబు రేట్లు పెట్టి లైసెన్సుదారులను బెదిరింపులకు గురిచేశారు. వారి నుంచి అత్యధిక మొత్తంలో డబ్బులు దండుకుంటున్నారు. బార్ ల ద్వారా ఈ ప్రభుత్వానికి 92 కోట్లు వస్తోంది. దీనికంటే మూడింతల రెట్లు లైసెన్సుదారుల వద్ద జగన్ అనుయాయులు వసూలు చేశారు. గతంలో డిజిటల్, ఆన్ లైన్ పేమెంట్లు లేవు. రెండు సూట్ కేసు విధానం పెట్టి అందులో పెద్ద అవినీతి సామ్రాజ్యం ఏర్పాటుకి పాల్పడ్డారు. కృష్ణా జిల్లాలో పాత బార్ యజమానులను ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పిలిపించి బెదిరించారు. వేరే వాళ్ల పేరున టెండర్లు వేద్దాం, ఎస్సీ, ఎస్టీ, బీసీలం మేం ఎక్కడ బార్లను నడపగలం?

రెడ్లు, రాజుల పేరున టెండర్లు వేద్దాం పెత్తనం మనం చేద్దాం అని చెప్పారు. వారి మాటలు వినొద్దు. వారితో కలిసి వ్యాపారం చేస్తే నష్టపోతారు. తిరిగి టీడీపీ అధికారంలోకి వస్తుంది. వచ్చాక అవినీతి సామ్రాట్ లను అందరినీ బయట పెడతుంది. అవినీతి డబ్బులతో అంతపురం నిండిపోయింది. డబ్బులు పెట్టుకోవడానికి ఎక్కడా చోటు లేదు. వచ్చిన డబ్బులు ఉంచుకోవడానికి ఖాళీ లేక సామంతరాజులకు కట్టబెడుతున్నాడు. కరోనా సమయంలో తాగుబోతులను కంట్రోల్ చేయడానికి ఉపాధ్యాయులను నియమించారు. టెండర్ విధానం పారదర్శకంగా జరగలేదు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి టెండర్ విధానాన్ని ఆపరేట్ చేశారు. టెండర్ విధానం న్యాయంగా, పారదర్శకంగా చేసే ఉద్దేశం వైసీపీకి లేదు. వ్యాపార ధృక్పథంతో పెద్ద సంఖ్యలో డబ్బులు వసూలు చేసుకోవాలని చూస్తున్నారు. వైసీపీ అనుచరులకు అవకాశం ఇచ్చారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.

జగన్.. మద్యంపై వచ్చే ఆదాయాన్ని అంతపురానికే కాక అనుచర వర్గానికి, సామంత రాజులకు కట్టబెడుతున్నారు. ప్రస్తుత మద్యం టెండర్లను రద్దు చేసి సిటింగ్ జడ్జీతో విచారణ జరిపించగలరా? విచారణ చేయిస్తే జగన్ అవినీతి బయటపడుతుంది. మద్యంతో గంటకు పది కోట్లు, రోజుకు 240 కోట్లు ఆదాయం వస్తోంది, ఈ ఆదాయం ఎటుపోతోంది? బేవరేజెస్ కార్పొరేషన్ కు మీరు చెల్లించేదెంత? అందులో మీ వాటా ఎంత? మీరు సచ్చీలురైతే న్యాయ విచారణకు ఆదేశించాలి. రాష్ట్రం డ్రగ్స్ కు వేదికైంది. రాష్ట్రంలో డ్రగ్స్ ని అరికట్టాల్సిన అవసరముంది. టెండర్లు తిరిగి రీకాల్ చేయాలని టీడీపీ తరపున మాజీ మంత్రి కే ఎస్ జవహర్ డిమాండ్ చేశారు.

LEAVE A RESPONSE