Suryaa.co.in

Telangana

ఈడీ అధికారులు భానుప్రియ, మీనాలతో కేటీఆర్ వాగ్వాదం

కవితను అరెస్టు చేసేందుకు వచ్చిన ఈడీ అధికారులపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, కవిత సోదరుడు కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈడీ అధికారులతో కేటీఆర్ ఏమన్నారంటే.. కోర్టు రక్షణ ఉండగా, ఆమెను అరెస్టు చేయడమేంటి ? దీనికి మీరు కోర్టులో తగిన మూల్యం చెల్లించుకుంటారు. అయినా ఈడీ అధికారులు కేటీఆర్ వాదనను పెద్దగా పట్టించుకోలేదు. వారు కూడా అందుకు తగిన సమాధానం ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. కవితను అరెస్టు చేస్తున్న సమయంలో మాజీ మంత్రి హరీష్‌రావు సహా పలువురు నాయకులు అక్కడే ఉన్నారు. కవిత కారెక్కిన తర్వాత తన కుమారుడికి ముద్దు పెట్టి, జాగ్రత్తలు చెప్పడం కనిపించింది. ?

సోదాలు పూర్తయ్యాయని, అరెస్ట్ వారెంట్ ఇచ్చామని ఈడీ అధికారులు భానుప్రియ, మీనాలు చెబుతున్నారని, అలాగే అరెస్ట్ వారెంట్ ఇచ్చామని చెబుతున్నారని పేర్కొన్నారు. సోదాలు ముగిశాక కూడా ఇంట్లోకి రావొద్దని అధికారులు హుకూం జారీ చేశాని ఆవేదన వ్యక్తం చేశారు. అరెస్ట్ చేయమని సుప్రీంకోర్టుకు చెప్పిన తర్వాత ఇప్పుడు ఎలా అరెస్ట్ చేస్తారు? అని వారిని ప్రశ్నించారు. సుప్రీంకోర్టులో చెప్పిన మాటను ఈడీ అధికారులు తప్పుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు ద్వారా ఈడీ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. కావాలని శుక్రవారం వచ్చారని మండిపడ్డారు. ట్రాన్సిట్ వారెంట్ లేకుండా కవితను ఎలా తీసుకు వెళతారు? అని ప్రశ్నించారు.

LEAVE A RESPONSE