– కేటీఆర్ జన్మదిన సందర్భంగా తెలంగాణ భవన్ కు భారీగా తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలు
– తెలంగాణ భవన్ లో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న నాయకులు
– తన పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న అభిమానులకు కేటీఆర్ ధన్యవాదాలు
బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినం సందర్భంగా తెలంగాణ భవన్ పరిసరాలు కోలాహలంగా మారాయి. తమ అభిమాన నేతకు జన్మదిన శుభాకాంక్షలు తెలపడానికి రాష్ట్రం నలుమూలల నుంచి నాయకులు ,కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు.
ఈ సందర్భంగా తెలంగాణ భవన్లో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడానికి సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.
అదేవిధంగా భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు చేస్తున్న అభిమానుల రుణం ఎప్పటికీ తీర్చుకోలేనని చెప్పారు. తనను అభిమానించే వారి ప్రేమ ఆశీర్వాదాలతో మరింత ఉత్సాహంగా ప్రజాసేవలో పాల్గొంటానన్నారు.