– సినిమా స్క్రిప్ట్ చదివి కేటీఆర్ డైలాగులు
– సత్తా లేనిదే సీఎం రేవంత్ సంవత్సరంలో రైతులకు రుణమాఫీ చేశారా?
– రాజకీయంగా రఘునందన్ చాలా చిన్నోడు
– కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు టి. జగ్గారెడ్డి
హైదరాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ నాలుక కొరకడంతో ఏమైతదని కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు టి. జగ్గారెడ్డి వ్యంగ్యంగా ప్రశ్నించారు. కాంగ్రెస్ వాళ్ల నాలుకలు చీరడం సాధ్యమా? కేటీఆర్ సినిమా స్క్రిప్ట్ చదివి డైలాగులు చెప్తాడని ఎద్దేవా చేశారు.
సత్తా లేనిదే సీఎం రేవంత్ సంవత్సరంలో రైతులకు రుణమాఫీ చేశారా? సత్తా లేనిదే ప్రమాణస్వీకారం చేసిన గంటల్లోనే మహిళలకు ఉచిత బస్సు ఇచ్చామా? అని ప్రశ్నించారు.
తమ ప్రభుత్వం పబ్లిసిటీ చేసుకోవడం లేదు కానీ సంవత్సరంలో వేలాది ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని, కేసీఆర్, హరీష్ రావు సైలెంట్‌గా ఉన్నారు కాబట్టే బీజేపీ ఎంపీగా రఘునందన్ గెలిచారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గెలవకూడదని కేసీఆర్, హరీష్ రావులు అనుకున్నారు కాబట్టే రఘునందన్ రావు గెలిచారని ఆయన స్పష్టం చేశారు.
రాజకీయంగా రఘునందన్ చాలా చిన్నోడు. నువ్వు నా సీఎంని ఏమనకపోతే నేను మీ పీఎంను ఏం అనక పోదును. నల్లధనాన్ని ప్రజలకి పంచుతానని ప్రధాని మోదీ ఇచ్చిన హామీ ఏమైందంటూ రఘునందన్‌ను ప్రశ్నించారు.
ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయి? పదేండ్లు పక్కపక్కన పడుకొని సంసారం చేయలేదా? ప్రధాని మోదీ మోసగాళ్ళకి మోసగాడంటే బీజేపీ వాళ్లు ఫీల్ అవ్వరా? ప్రధాని మోదీని తాము గౌరవిస్తామని, కానీ రఘునందన్ వల్లే తిట్టాల్సి వస్తుందని ఆయన స్పష్టం చేశారు.