చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్

అమరావతి : కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ టీడీపీలో చేరారు. టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో గురువారం పార్టీలో చేరారు. పసుపు కండువా కప్పి సంజీవ్ కుమార్ ను చంద్రబాబు పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. సంజీవ్ కుమార్ తో పాటు పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ ప్యాలకుర్తి రమేష్, వెంకాయపల్లె ఆలయ చైర్మన్ బేతం కృష్ణుడు, వాల్మీకి సంఘం నాయకులు ముండ్ల శేఖర్, తలారి కృష్ణ, ఎన్జీవో మాజీ నాయకులు కుబేర స్వామి, నరసింహులు, శాంతకుమారి, తదితరులు చేరారు.

Leave a Reply