-భూకబ్జా అనేది వైసీపీ బ్రాండ్
-పంపుసెట్లకు మీటర్లు పెడతామని వస్తే ఒప్పుకోవద్దు..మేం మీకు అండగా ఉంటాం
-ట్రాన్స్ ఫార్మర్ లు కాలిపోతే పట్టించుకునే దిక్కులేదు
-రైతులకు సమస్యలు తప్ప సంతోషం లేదు
-డీకేటీ భూములపై యజమానులకే హక్కు ఉండేలా చట్టం తెస్తాం
-హంతకుడు, మోసగాడిని నమ్మి మోసపోవద్దు
-కొండేపల్లి క్రాస్ వద్ద రైతులతో యువనేత నారా లోకేష్ ముఖాముఖి
రైతులతో టీడీపీ యువనేత లోకేష్ తన యువగళం పాదయాత్రలో ముచ్చటించారు.ఆయన వారి సమస్యలు సావధానంగా విన్నారు. రైతులు కూడా తమ సమస్యలు ఆయనకు వెళ్లబోసుకున్నారు. ఆరుగాలం కష్టపడి వ్యవసాయం చేస్తున్నా, పంటలకు గిట్టుటాటు ధర రావడం లేదని రైతులు కుమిలిపోయారు. తమను పట్టించుకునే దిక్కులేదని వాపోయారు. రైతుల వెంట టీడీపీ ఉంటుందని, మళ్లీ మరోసారి మోసం చేసేందుకు వస్తున్న జగన్‌రెడ్డిని నమ్మి మోసపోవద్దని లోకేష్ సూచించారు. టీడీపీ రైతు పక్షపాతి అని భరోసా ఇచ్చారు. రైతులు- లోకేష్ మధ్య సంభాషణ ఇలా సాగింది..
జై:
వ్యవసాయ ఖర్చులు చాలా పెరిగిపోయాయి. వ్యవసాయ పనులను ఉపాధిహామీ పథకానికి అనుసంధానం చేయాలని కోరితే ఎవరూ పట్టించుకోవడం లేదు. మా ప్రాంతంలో డ్రిప్ ఇరిగేషన్ చాలా అవసరం. దాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. విత్తనాలు, మందులు, ఎరువుల్లో కల్తీ జరుగుతోంది. మీరు అధికారంలోకి వచ్చాక ఈ సమస్యల్ని పరిష్కరించాలి.
లోకేష్:
జగన్ రెడ్డి రైతు లేని రాజ్యాన్ని తీసుకొచ్చాడు. వ్యవసాయ పెట్టుబడిని పెంచేశారు. గిట్టుబాటు, మద్దతు ధరను పెంచేశారు. హార్టీ కల్చర్ సాగు భూముల్లో భూసార పరీక్షలు చేయాలి. కానీ వైసీపీ ప్రభుత్వం చేయడం లేదు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక వ్యవసాయ పెట్టుబడిని తగ్గిస్తాం. వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తాం. వ్యవసాయాన్ని ఉపాధిహామీకి అనుసంధానం చేయాలనే డిమాండ్ ను కేంద్రంతో పోరాడి చేయాల్సి ఉంది. దీన్ని మేం తూచా తప్పకుండా అజెండాగా తీసుకుని నిర్వహిస్తాం. రైతును చంపడానికి మోటార్లకు మీటర్లు పెట్టేందుకు ప్రభుత్వం వస్తోంది. ఆ మీటర్లు బిగిస్తే అవే రైతుల మెడకు ఉరితాళ్లుగా మారతాయి. గ్యాస్ ధర సబ్సిడీలు మాదిరిగానే వ్యవసాయ మీటర్లను విషయంలోనూ మోసం చేస్తారు. పంపుసెట్లకు మీటర్లు పెడతామని వస్తే ఒప్పుకోవద్దు..మేం మీకు అండగా ఉంటాం.
శ్రీరాములు: విద్యుత్ కనెక్షన్లు ప్రభుత్వం సకాలంలో అందించడం లేదు. గత ప్రభుత్వాలు వైర్లు, పోల్స్ సబ్సిడీపై ఇచ్చేవి. ఈ ప్రభుత్వం ఇవ్వడం లేదు. గతంలో రిజిస్ట్రేషన్లు అయిన భూములను కూడా నేడు డీకేటీ భూములు అంటున్నారు. పశువులకు వైద్యం చేయించేందుకు ప్రతిసారి టౌన్ కు తీసుకెళ్లాల్సివస్తోంది. గ్రామాల్లోనే పశువుల ఆసుపత్రులను ఏర్పాటు చేయాలి. ఉచితంగా మందులు, దాణా ఇప్పించాలి.
లోకేష్: గతంలో చంద్రబాబు పాలనలో నాణ్యమైన విద్యుత్ ను రైతులకు అందించారు. ఫీడర్, ట్రాన్స్ ఫార్మర్, విద్యుత్ అవసరాలను మొత్తాన్ని చంద్రబాబు ప్రతిరోజు సమీక్షించేవారు. నేడు ట్రాన్స్ ఫార్మర్ లు కాలిపోతే పట్టించుకునే దిక్కులేదు. రైతులకు సమస్యలు తప్ప సంతోషం లేదు. గతంలో చంద్రబాబు పాలనలో ఏ విధంగా మీకు సదుపాయాలు, సౌకర్యాలు ఉండేవో వాటిని మేం తీసుకొస్తాం. పాడిరైతులకు పశుగ్రాసాన్ని చంద్రబాబు పాలనలో సబ్సిడీపై ఇచ్చేవారు. పశువులకు అనారోగ్య సమస్యలు వస్తే గోపాలమిత్రలతో వైద్యసహాయం అందించేవారు. నేడు అవేమీ లేవు. పాల దిగుబడి తీవ్రంగా తగ్గిపోయింది. పెట్టుబడి పెరిగింది, పాలకు గిట్టుబాటు ధర లభించడం లేదు. జగన్ రెడ్డి హాలిడే సీఎం. అందుకే క్రాప్, ఆక్వా హాలిడేలతో రైతులను ఇబ్బందులు పెడుతున్నారు. చంద్రబాబు పాలనలో ఒక్కో రైతుపై రూ.70వేల తలసరి అప్పు ఉంటే నేడు జగన్ రెడ్డి రూ.2.50లక్షలకు పెంచాడు. ఏ రాష్ట్రంలోనూ రైతులపై ఇంత అప్పు లేదని కేంద్ర నివేదికలు చెబుతున్నాయి. వైసీపీ పాలనలో కొండలు, గుట్టలు, చెరువులు అన్నింటినీ వైసీపీ పాలకులు కబ్జా చేస్తున్నారు. డీకేటీ భూములపై యజమానులకే హక్కు ఉండేలా చట్టం తెస్తాం.
లోకనాథం: మొగరాల పంచాయతీలో నీటి ఎద్దడి చాలా ఎక్కువ. హంద్రీనీవా నుండి సబ్ ఛానల్ ద్వారా మా చెరువుకు నీరు ఇవ్వగలితే మాకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పంటలు వేసే పరిస్థితి ఉండడం లేదు. మా ప్రాంతంలో గతంలో చెరకు వేసేవారు. నేడు నల్లబెల్లం పేరుతో అధికారులు చెరకు రైతులను ఇబ్బందిపెడుతున్నారు.
లోకేష్: రాయలసీమలోని చెరకు ఫ్యాక్టరీలను 4 నుండి 6కు పెంచుతామని అన్నారు. కానీ నేడు ఒక్క ఫ్యాక్టరీకే జగన్ రెడ్డి పరిమితం చేశాడు. నల్లబెల్లం పేరుతో జగన్ సర్కార్ రైతులను చాలా ఇబ్బందులు పెడుతున్నారు. ఇది రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సమస్యే. చంద్రబాబు సీఎంగా ఉండగా రైతులకు ఎటువంటి ఇబ్బందులు ఉండేవి కాదు. వ్యవసాయశాఖ మంత్రి కోర్టులో దొంగతనం చేసి సీబీఐ చుట్టూ తిరుగుతున్నాడు. రైతుల సంక్షేమాన్ని గాలికొదిలేశాడు. మాజీమంత్రి అనిల్ కుమార్ 2021నాటికి పోలవరం పూర్తిచేస్తానని బల్లగుద్ది చెప్పి, మంత్రిపదవి నుండి పోయాడు. నేడు మంత్రిగా ఉన్న అంబటి రోడ్లపై డ్యాన్సులు వేస్తున్నాడే తప్ప పోలవరాన్ని పట్టించుకోవడం లేదు. ముఖ్యమంత్రి కనీసం పోలవరాన్ని పట్టించుకోవడం లేదు.
ఈశ్వరరెడ్డి: మా గ్రామం తిరుమాలపల్లిలో చెరువు ఉంది. అది ఇటీవల వచ్చిన వరదలకు కట్టతెగిపోయింది. ఆ చెరువును క్రికెట్ స్టేడియం చేయాలని ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది. మా భూములను రాజకీయ కక్షలతో కబ్జాచేస్తున్నారు. రైతులకు ప్రత్యేకంగా గుర్తింపుకార్డులు ఇవ్వండి.
లోకేష్: భూకబ్జా అనేది వైసీపీ వాల్ల బ్రాండ్. చెరువు, కొండలు, గుట్టలను కబ్జాలు చేస్తున్నారు. పాత రికార్డులను తీసుకుని, విచారణ జరిపించి కబ్జా చేసిన వాళ్లపై చర్యలు తీసుకుంటాం. దళితుల చేతుల్లో ఉన్న భూముల సంఖ్య వైసీపీ పాలనలో చాలా తగ్గిపోయాయి. వైసీపీ వాళ్లు దళితుల భూములు లాక్కుంటున్నారు. వారందరికీ టీడీపీ అధికారంలోకి వచ్చాక న్యాయం చేసి, వారి భూములు వారికి ఇప్పిస్తాం. రైతులకు గుర్తింపుకార్డులివ్వడం చాలా చిన్నపని. టెక్నాలజీ ద్వారా ఈ కార్డులు మీ ఫోన్ లో వచ్చేలా చేస్తాం. రైతుల భూముల పట్టాదారు పాస్ పుస్తకంపై జగన్ రెడ్డి ఫోటోలు ముద్రించుకుంటున్నారు. కౌలురైతులకు కూడా ప్రత్యేక కార్యాచరణ ద్వారా న్యాయం చేస్తాం.
చిట్టిబాబునాయుడు: అన్నిరకాల పంటలు పండించి నష్టపోయి చివరకు మామిడి పంట పండిస్తున్నాం. పురుగు మందుల్లో నాణ్యత లేక 5సార్లు మందులు కొట్టించినా పంట దిగుబడి రావడం లేదు. వచ్చిన పంటకు గిట్టుబాటు ధర రాకుండా దళారి వ్యవస్థ దోచుకుంటోంది. కౌలు వ్యవసాయం చేసే పరిస్థితి కూడా పోయింది. రోడ్లు సరిగాలేక పంట కొనుగోలు చేసేందుకు వ్యాపారులు రావడం లేదు. మీరు అధికారంలోకి వచ్చాక రైతులకు న్యాయం చేయాలి.
లోకేష్: జగన్ రెడ్డి ప్రభుత్వం తయారుచేస్తున్న కల్తీ మద్యం పురుగుల మందు కంటే పవర్ ఫుల్ గా పనిచేస్తోందని ల్యాబ్ రిపోర్టులు చెబుతున్నాయి. పురుగుల మందులు నుండి మనుషులు తాగే మద్యం వరకు అన్నీ కల్తీలే. జగన్ ప్రభుత్వమే కల్తీ ప్రభుత్వం. ముఖ్యమంత్రికి సమర్ధత లేకనే రైతులకు ఈ దుస్థితి వచ్చింది. మీ ప్రాంతంలో రైతులకు అందుబాటులో మార్కెట్ యార్డ్, కోల్డ్ స్టోరేజ్ లను తీసుకొస్తాం. ఉత్తరభారతదేశంలో ఆమ్ చూర్ ను తయారుచేస్తున్నారు. దానిపైనా రైతులు దృష్టిపెడితే దానికి సంబంధించిన యంత్రాలను మేం ఏర్పాటు చేస్తాం. ఉత్తరభారతదేశానికి మీరే ఆమ్ చూర్ సరఫరాచేసేలా తయారుచేస్తాం. గత పాలనలో ఆస్ట్రేలియా టెక్నాలజీతో రోడ్లు వేయించాను. అదేవిధంగా మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత డొంకరోడ్లు కూడా నిర్మిస్తాం. చంద్రగిరి నియోజకవర్గంలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగిరితేనే మీ కష్టాలు తీరతాయి. అభివృద్ధి జరుగుతుంది. చెవిరెడ్డి నియోజకవర్గ ప్రజలకు చీర, స్వీట్ బాక్స్, చెవిలో పువ్వు మాత్రమే ఇచ్చాడు. మీ జీవితాల్లో ఏ మార్పూ రాలేదు. చెవిరెడ్డి చెవులో పువ్వుపెట్టి, చీర, ప్యాంటు ఇచ్చేలా మిమ్మల్ని ఆర్థికంగా అభివృద్ధి చేస్తాం.
రామనాథం: రాయలసీమలో గతంలో చెరకు, వరి పండించేవారు. కానీ నేడు మామిడి పంట పండిస్తున్నారు. పంటలకు గిట్టుబాటు ధర రాక ఇబ్బందులు పడుతున్నారు. పిల్లలు చదువుకుని బెంగళూరు, చెన్నై వెళ్లి తమ తల్లిదండ్రులను కూడా తీసుకెళ్లిపోతున్నారు. వ్యవసాయాన్ని వదిలేస్తున్నారు. పురుగుమందులు నాణ్యత లేక దిగుబడి రావడం లేదు. డ్రిప్ ఇరిగేషన్ లేదు.
లోకేష్: మీ ఓటును అమ్ముకున్నంతకాలం మీ జీవితాలు బాగుపడవు. రైతులకు గిట్టుబాటు ధర రాదు. వ్యవసాయం నష్టాల్లోనే ఉండిపోతుంది. వచ్చే ఎన్నికల్లోనూ ఇంటికి కేజీ బంగారం ఇస్తాం అంటారు. రూ.5వేలు ఓటుకు పంచుతాడు. మీరు ఓట్లు వేస్తే మళ్లీ గెలిచి మీ నడ్డి విరుస్తాడు. చంద్రబాబు ఒకే ఒక్క సంతకంతో రైతుల రుణాలను మాఫీ చేశారు. పంటలకు గిట్టుబాటు ధరలను అందించారు. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చేముందు రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని, జనవరిలోనే ధరలను ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. ఈ నాలుగేళ్లలో ఒక్కసారి కూడా ప్రకటించలేదు. గిట్టుబాటు ధర కల్పించేందుకు ధరల స్థిరీకరణ నిధి రూ.3వేల కోట్లు కేటాయిస్తామని అన్నారు. అదీ లేదు. పంట బీమాలు లేవు. ప్రకృతి విపత్తులు వచ్చి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అబద్దాలు చెప్పడంతో జగన్ రెడ్డి సిద్ధహస్తుడు. వివేకాను చంపి ఆ నెపాన్ని చంద్రబాబుపై నెట్టాడు. ఇటువంటి హంతకుడు, మోసగాడిని మరోసారి నమ్మి మోసపోవద్దు. మీ సంక్షేమాన్ని కోరే ప్రభుత్వానికి పట్టం కట్టాలని కోరుతున్నాం.