– బీజేపీ నేత లంకా దినకర్
సీఐతో చీదరింపుకు గురైన మంత్రి అప్పల రాజు, బాష సరిదిద్దుకోకపోతే ప్రజలే వైజాగ్ మెంటల్ హాస్పిటల్లో చేరుస్తారు. హైకోర్టు తీర్పు మేరకు రాష్ట్ర బడ్జెట్ లో ఆమరావతికి కేటాయింపులు చేసి జగన్ పరువు నిలుపుకోవాలి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అమరావతి మాత్రమే ఏపీ రాజధాని అని 2022-23 బడ్జెట్లో స్పష్టత ఇచ్చింది. మొన్న జీఏస్ఐ అమరావతిలో, నేడు నాసిన్ అకాడమీ అనంతపురంలో నిర్మాణ ప్రారంభంతో, కేంద్రప్రభుత్వ సంస్థల ఏర్పాటు ప్రక్రియ వేగవంతం అయ్యింది. అమరావతిలో భూ కేటాయింపు జరిగిన కేంద్ర సంస్థలన్ని త్వరలో నిర్మాణాలు ప్రారంభం చేస్తాయి. తుప్పు పుట్టిన మూడు ముక్కల ఆట మంత్రులు ఇంకా ఆడితే, న్యాయస్థానం ఆ ఆట ఆడేవారి మెదడుకు పట్టిన చెదలు వదిలిస్తుంది.