జై భీమ్ సినిమా తరహాలో..చిత్తూరులో ఎస్సీ మహిళపై లాఠీ కాఠిన్యం

– జిల్లా జైలు సూపరింటెండెంట్ వేణు గోపాల్ రెడ్డి ఇంట్లో డబ్బు పోయిందట
– దొంగతనం పేరుతో పని మనిషిపై పోలీసుల చిత్ర హింసలు

తిరుపతి : దొంగతనం పేరుతో ఓ మహిళను పోలీసులు చిత్ర హింసలు చేసిన సంఘటన చిత్తూరు నగరంలో చోటు చేసుకుంది. నగరంలోని లక్ష్మి నగర్ కాలనీకి చెందిన ఉమా మహేశ్వరి చిత్తూరు జిల్లా జైలు సూపరింటెండెంట్ వేణు గోపాల్ రెడ్డి ఇంట్లో ఏడాది కాలంగా పని చేస్తోంది.

వేణు గోపాల్ రెడ్డి ఇంట్లో రూ. రెండు లక్షల నగదు కనిపించక పోవడంతో పని మనిషి ఉమా మహేశ్వరినీ ప్రశ్నించారు. నగదు కనిపించక పోవడానికి తనకు ఎలాంటి సంబంధం లేదని ఉమా మహేశ్వరి చెప్పినా వినకుండా పోలీసులను పిలిపించారు.ఈ నెల 18 వ తేదీ చిత్తూరు ఒకటో పట్టణ పోలీసు స్టేషన్ కు తనను
tpt-lady1 పిలిపించి చేతి వేలి ముద్రలు తీసుకుని, పోలీసులు పంపించేసినట్లు ఉమా మహేశ్వరి మీడియా ప్రతినిధుల కు తెలిపారు. అనంతరం 19 వ తేదీ తనను మళ్లీ పోలీసు స్టేషన్ కు పిలిచి ఒక మగ, మరొక మహిళా కానిస్టేబుల్స్ తన కాళ్ళు చేతులు కట్టి వేసి లాఠీలతో తీవ్రంగా కొట్టినట్లు వెల్లడించారు.స్పృహ కోల్పోయే వరకు తనను పోలీసులు కొట్టారని ఆమె తెలిపారు.

అనంతరం CI దగ్గర నన్ను హాజరుపరచగా ఆయన నాకు చెప్పిన మాట, నీ వేలు ముద్రలు మ్యాచ్ కాలేదు, ఈ దొంగతనం తో నీకు సంబంధం లేదు మాకు తెలిసింది, నిన్ను వదిలి పెడతాము, నిన్ను

కొట్టినట్లు ఎవరికీ చెప్పొద్దు, ఎంత డబ్బు కావాలన్నా ఇప్పిస్తాను, చెప్పినారు, మళ్లీ సిఐ ఎదురుగా నన్ను కొట్టి తరువాత తనను పోలీసులు విడిచి పెట్టారని ఆమె మీడియాకు వివరించింది.

తీవ్ర గాయాలపాలైన ఉమా మహేశ్వరి అస్వస్థతకు గురికావడంతో ఆమె భర్త దీన , తల్లి ఆమెను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఎస్సీ కులానికి చెందిన తనను పలుమార్లు కులం పేరుతో పోలీసులు దూషించారని ఆమె చెప్పారు.

Leave a Reply