Suryaa.co.in

Andhra Pradesh

దేశాన్ని స్వచ్ఛత వైపు నడిపించండి

– పంచాయతీలకు మంత్రి సవితమ్మ ట్రాక్టర్ల పంపిణీ

రొద్దం: స్వచ్ఛభారత్ ద్వారా శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలంలోని కలిపి, నారానాగే పల్లి, దొడగట్ట పంచాయతీలకు మూడు ట్రాక్టర్లను రాష్ట్ర బీసీ సంక్షేమ చేనేత, జౌలి శాఖ మంత్రి సవితమ్మ శుక్రవారం పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆమె ఏమన్నారంటే… దేశాన్ని స్వచ్ఛత వైపు నడిపించండి. గ్రామాలు పరిశుభ్రంగా ఉంటేనే రాష్ట్రం, దేశం పరిశుభ్రంగా ఉంటుంది. వాహనాలను జాగ్రత్తగా, ఉపయోగకరంగా వాడుకోవాలి. ఇప్పటికే నగరాలు, పట్టణాల్లో ఇంటింటికీ చెత్త సేకరణ జరుగుతోంది. గ్రామాల్లో ఇది పూర్తి స్థాయిలో జరగాలి. గ్రామాల్లో ఎవరు అడుగుతారని.. ఎక్కడబడితే అక్కడ చెత్త వేస్తే, అది మనకే హాని. ముందు మన ఇళ్ళు, పరిసరాలు, ఆ తర్వాత గ్రామాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. అప్పుడే రాష్ట్రం, దేశం పరిశుభ్రంగా ఉంటుంది. ఈ కార్యక్రమంలో అధికారులు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE