Suryaa.co.in

Features

నాయకుడు.. ప్రతి నాయకుడు

సంపదను
సృష్టించే వాడు!
పదిమందికి
పని చూపించేవాడు
జ్ఞానమార్గంలోకి
నడిపించేవాడు
నాయకుడు!

ఉన్న ఆస్తుల్ని
అమ్మేసేవాడు!
దోపిడీదారులతో
జతకట్టేవాడు!
ప్రజల్ని అజ్ఞానంలోకి
నెట్టే వాడు
ప్రతి నాయకుడు!

నా దేశానికి
నాయకుడెవరు?
77ఏళ్ళ స్వతంత్రం!
కుంభకోణాలు-రైతు
వ్యతిరేక చట్టాలు
ఆస్తులు అమ్మేసేవాళ్ళు
దొంగలకు
తాళాలిచ్చేవాళ్ళు

ఐదేళ్లకొకసారి
మోసపూరిత
మ్యానిఫెస్టోలతో
ప్రజా ద్రోహులు!
ఓట్లు కొనేవాళ్ళు!
కోట్ల ఆస్తులు
కూడేసుకొనేవాళ్ళు!
ఇదే చరిత్ర
చర్విత చర్వణం!

కాలం కదిలేకొద్దీ
తొండ ముదిరి
ఊసరవెల్లి ఐంది!
కండువాలు మార్చే
దుండగులొచ్చారు!
నీతి నియమం లేదు
ప్రజల ధ్యాసే లేదు!
నిత్యం వాడి స్వార్ధమే!

దేశాన్ని మరో వందేళ్లు
ఏక ఛత్రాధిపత్యం!
విద్రోహ ముఠాలు
కాలాపానీ గాళ్ళు
ఎలక్టోరల్ బాండ్స్ తో
కొత్త కుంభకోణాలకు
తెర తీసిన వాళ్ళు
నాయకులు కాలేరు!

పాత సమాజం తాలూకు
కులమతాలు అనే
అవశేషాలకు!
మూఢ నమ్మకాలపై !
పునాదులు తీసే
విద్యావిహీనులెవ్వరూ
నాయకులు కాలేరు!

నా దేశానికి
నాయకుడు లేడు!
దోపిడీ వర్గాల నుండి
బూర్జువా వర్గాల నుండి
నాయకుడు రాడు!
వీళ్ళ విద్రోహాలకు బలియై
విసిగి వేసారిన
పీడితవర్గాలనుండి
‘నాయకుడు’ వస్తాడు!

– మహమ్మద్ రఫీ

LEAVE A RESPONSE