Suryaa.co.in

Political News

రెడ్లకు అందలం.. క్రైస్తవులకు మోసం

– ఇదే జగన్ ఐదేళ్ల నిర్వాకం
– క్రైస్తవుల పేరుతో మతానికి మోసం
– క్రైస్తవుల పేర్లు పెట్టుకున్న ఎస్సీలకు పదవులు
– నిజమైన క్రైస్తవులకు మొండిచేయి
– గత ఎన్నికల్లో జగన్‌ను గెలిపించింది క్రైస్తవులే
– పార్టీని రెడ్లకు అప్పగించారు

ఏప్రిల్ 2 నుంచి ముగ్గురు నూతన రాజ్యసభ ఎంపీలు సభ్యత్వంతో, వైఎస్ఆర్ సిపి రాజ్యసభలో సంపూర్ణ మెజార్టీ సాధించింది. 11 ఎంపీలు కి, 11 ఎంపీలు వైయస్సార్సీపి వశమైనవి. కానీ జగన్ క్రైస్తవుడు, క్రైస్తవులకు ఎక్కువ చేస్తున్నాడు అనుకుంటారు. అన్ని వర్గాల కంటే ఘోరమైన అన్యాయం క్రైస్తవ సమాజానికి జగన్ చేశారు.

వైఎస్ఆర్ సిపిలో పదవులు, పెత్తనం రెడ్లకి, పేదలను పథకాలకి పరిమతం చేసి జగన్ మోసం చేశారు. సొంత మతానికి మొండి చేయి. దీనికి నిదర్శనం 11 రాజ్యసభ ఎంపీలలో, ఐదుగురు రెడ్డి సామాజిక వర్గం సంబంధించిన వారు. ఒక్కటి కూడా క్రైస్తవులకు ఇవ్వలేదు. అలాగే 48 ఎమ్మెల్సీ స్థానాల్లో కూడా.. నలుగురు ముస్లిం వర్గానికి ఇస్తే, ఒక్కటి కూడా క్రైస్తవ సమాజానికి ఇవ్వలేదు.

మన పక్కనే ఉన్న చిన్న రాష్ట్రమైన తెలంగాణలో కూడా, ఒక ఎమ్మెల్సీని క్రైస్తవులకు గత ప్రభుత్వం కేటాయించింది. జగన్ ఇవ్వక పోగా, షెడ్యూల్ కులాల వారికి నామినేటెడ్ పదవులు ఇచ్చి, క్రైస్తవ మైనారిటీకి ఇచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి చెప్పడం మోసపూరితమే.

క్రైస్తవులంటే ఒక్క షెడ్యూల్ కులాల వారే కాదు. ఏ కులాల వారైనా ఏసుప్రభుని నమ్మి, చర్చికి వెళ్తూ, రాజ్యాంగ ప్రకారం క్రైస్తవుడుగా నమోదు చేసుకుంటే వారు క్రైస్తవ మైనార్టీ క్రిందకు వస్తారు. షెడ్యూల్ కులాల వారు చర్చికి వెళ్తూ, క్రైస్తవ పేరు ఉన్నప్పటికీ, వారు బహిరంగంగా క్రైస్తవుడుగా డిక్లేర్ చేసుకోకపోతే, వారు క్రైస్తవ మైనార్టీ క్రిందకు రా రు. ఎస్సీ షెడ్యూల్ కులాల కోటలోనే ఉంటారు. ఈ విషయం తెలిసి కూడా జగన్మోహన్ రెడ్డి క్రైస్తవులను మోసగించారు. ఒక వ్యక్తిని షెడ్యూల్ క్యాస్ట్ కోటాలోను, క్రైస్తవ మైనారిటీలోను ఎలా చూపిస్తారు?

రాజ్యాంగం లోని 1950 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ ప్రకారం.. భారతదేశంలో ఒక్క షెడ్యూల్ కులాల వారు ఏసుప్రభు నమ్మితే, వారుకున్న 15 శాతం షెడ్యూల్ క్యాస్ట్ రిజర్వేషన్ పోతుంది. ఒక శాతం రిజర్వేషన్ వున్న బీసీ సీ క్యాటగిరి లోకి వెళ్ళిపోతారు. ఇది ఒక అన్యాయం. ఆ అన్యాయం భరించి షెడ్యూల్ కులాల వారు రిజర్వేషన్ వదులుకుని, బీసీ సీ క్రైస్తవులుగా ఉంటే, జగన్.. ఎస్సీ లకు ఇచ్చి, క్రైస్తవులకు ఇచ్చినట్టుగా చూపించి క్రైస్తవులకు అన్యాయం చేశారు.

నామినేటెడ్ పదవుల విషయం లో క్రైస్తవులైన బీసీ సీ లని బీసీల కోటా కింద న్యాయం చేయలేదు. క్రైస్తవ మైనారిటీ కోటా కింద న్యాయం చేయ లేదు. ఏపీ స్టేట్ క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని జగన్ జాన్ వెస్లీ ఎస్సీ మాల వర్గానికి ఇచ్చారు.

జగన్మోహన్ రెడ్డి 18 ఎమ్మెల్సీల ఖాళీలకు అభ్యర్థులను నియమిస్తూ, నా ఎస్సీలకు, బీసీలకు, మైనారిటీలకు సమన్యాయం చేశాను అని మాట్లాడారు. దానిలో ముస్లింలు లేరు. క్రైస్తవ పేర్లు ఉన్నాయి. కానీ వారు క్రైస్తవులుగా డిక్లేర్ చేసుకోలేదు. ఒకాయన బొమ్మి ఇజ్రాయిల్, ఎస్సీ మాదిగ సామాజిక వర్గం. ఇంకొకరు చంద్రగిరి యేసు రత్నం. ఆయన వడ్డెర సామాజిక వర్గం. కానీ వారి పేర్లు మాత్రమే క్రైస్తవ పేర్లు క్రైస్తవ సమాజ పక్షంగా వారేమి లేరు.

ఇజ్రాయిల్, యేసు రత్నం స్పీచెస్ లో వారి సామాజిక వర్గాన్ని ప్రస్తావించారు గాని, క్రైస్తవ సమాజానికి ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు చెప్ప లేదు. అయినా జగన్ వారిని క్రైస్తవ మైనారిటీ కింద ఇచ్చినట్టు చెప్పటం, క్రైస్తవులను పుచ్చటమే. 48 ఎమ్మెల్సీ స్థానాలలో, నాలుగు ఎమ్మెల్సీ ముస్లిం వర్గానికి ఇచ్చారు. 11 రాజ్య సభ స్థానాలలో, ఐదు రాజ్య సభ స్థానాలు రెడ్లకు ఇచ్చారు. ఒక్క స్థానం కూడా క్రైస్తవులకు ఇవ్వలేదు. రాజ్యాంగం ప్రకారం మైనారిటీస్ గా క్రిస్టియన్, ముస్లిం, సిక్, బుద్దిస్ట్, జురాస్టియన్ అయితే, ఒక్క ముస్లిం వర్గాన్నే మైనారిటీ గా చూస్తున్నారు. భారతదేశ రాజ్యాంగం.. క్రైస్తవులను మైనార్టీలుగా గుర్తిస్తే, జగన్ క్రైస్తవులను ఆంధ్ర రాష్ట్రంలో మైనారిటీగా గుర్తించలేదు.

రెడ్లు 70 శాతం వైసీపీ కి ఓట్లు వేస్తే, సుమారు 25 శాతం ఉన్న క్రైస్తవ సమాజం, జగన్ ని ఓన్ చేసుకుని 98% ఓట్లేసిన క్రైస్తవుల పట్ల, కృతజ్ఞత లేకుండా జగన్ మోసం చేశారు. రాష్ట్రం మొత్తాన్ని సజ్జల, వై వి సుబ్బా రెడ్డి, విజయసాయిరెడ్డి ,పెద్దిరెడ్డి రామ చంద్ర రెడ్డి నలుగురు రెడ్లకు పంచి ఇచ్చారు. దీనిని క్రైస్తవ సమాజం గుర్తించి , జగన్ క్రైస్తవ వైఖరిని గ్రహించాలి. లేకపోతే జగన్ ఇంకా క్రైస్తవకార్డుతో క్రైస్తవ సమజాన్ని మోసం చేస్తూనే ఉంటారు.

– ప్రొఫెసర్ డాక్టర్ జోసెఫ్ మోసిగంటి
చైర్మన్, జీసస్ బిలీవర్స్ అసోసియేషన్ కౌన్సిల్ (JBAC),
సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇంజినీరింగ్ కాలేజెస్ మాజీ డైరెక్టర్ గుంటూరు,
Phone : 7075482182, website : www.jbac.in

LEAVE A RESPONSE