– ప్రతి మనిషి కి ఆత్మభిమానం,ఓర్పు,సహనం ఉంటాయి
– పార్టీ అధికారాన్ని అనుభవిస్తూ, పార్టీ నడిపే స్థాయిలో ఉన్నారు
– వారి వల్లే పార్టీకి తీరని నష్టం
– పదవుల కోసం వెంపర్లాడటం మా ఇంట వంటా లేదు
– ఆత్మాభిమానం కోసం బ్రతికే వాళ్ళని అవమానిస్తే, ఇలాంటి పరిణామాలే ఉంటాయి
– హోం శాఖ మాజీ మంత్రి మేకతోటి సుచరిత
హోం శాఖ మాజీ మంత్రి మేకతోటి సుచరిత ఎట్టకేలకు తన అసంతృప్తిని వెలిబుచ్చారు. తనకూ ఆత్మాభిమానం ఉన్నాయన్నారు. అసలు పార్టీ స్థాపన సమయంలో కనిపించని వ్యక్తులు, పార్టీ కష్టాల్లో కనిపించని వ్యక్తులు ఇప్పుడు తమ నెత్తిపైకెక్కి పెత్తనం చేస్తున్నారంటూ రగిలిపోయారు. అందుకే ఇలాంటి పరిణామాలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. అడుగులకు మడుగులొత్తితే తానూ క్యాబినెట్లో కొనసాగేదానినని వ్యాఖ్యానించారు. సుచరిత ఏమన్నారంటే…
అలా అయితే 2009 లో వైస్ కుటుంబం కోసం అసెంబ్లీ లో తల వంచుకొని నిలబడి, రాజీనామా చేసేవాళ్ళము కాదు. అప్పటి కాంగ్రెస్ ఎన్నో ప్రలోబాలకు గురించేసింది. వాటన్నిటిని తట్టుకొని నిలబడ్డాము.బెదిరించారు.ఆశ చూపారు. కానీ మాకు వైస్ కుటుంబం ముఖ్యం. ఈరోజు కూడా అంతే… పదవి ముఖ్యం కాదు కానీ ప్రతి మనిషి కి ఆత్మభిమానం,ఓర్పు,సహనం అనేవి ఉంటాయి.అడుగులకు మడుగులు ఒత్తితే అలాగే కొనసాగే వాళ్ళము. కష్టకాలంలో పార్టీ పెట్టేటప్పుడు లేని వారు ఇప్పుడు పార్టీ అధికారాన్ని అనుభవిస్తూ, పార్టీ నడిపే స్థాయిలో ఉన్నారు. అలాంటివారి అనాలోచిత నిర్ణయాల వల్ల పార్టీకి, ప్రభుత్వానికి నష్టం. ఆత్మాభిమానం కోసం బ్రతికే వాళ్ళని అవమానిస్తే, ఇలాంటి పరిణామాలే ఉంటాయి అని అధిష్టానం ఇప్పటికైనా తెలుసుకోవాలని మనవి.