సమరయోధుల స్ఫూర్తితో ముందుకు సాగుదాం.!

– సెయింట్ ఎడ్యుకేషనల్‌ సొసైటీ కార్యదర్శి కె.చంద్రశేఖర్‌రెడ్డి

హైదరాబాద్‌: స్వాతంత్ర సంగ్రామం స్ఫూర్తి ని, అలనాటి త్యాగ ధనుల గొప్పతనాన్ని ఈ తరానికి అందించేందుకు స్వతంత్ర న్యూస్ ఛానల్ నిర్వహిస్తున్న స్వతంత్ర స్ఫూర్తి కార్యక్రమం కు విశేష స్పందన లభిస్తోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాల్లోనూ స్వతంత్ర స్ఫూర్తి టీం విరివిగా పర్యటించింది. 3 వేల కు పైగా కిలోమీటర్ల దూరం ప్రయాణించి, వందలాది గ్రామాల మీదుగా ఈ ప్రయాణం సాగుతూ తెలంగాణ లో ప్రవేశించింది. స్వతంత్ర టీవీ న్యూస్ చానెల్ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణ ప్రసాద్ పిలుపు మేరకు స్వతంత్ర స్ఫూర్తి ని ఈ తరంలో నింపేందుకు 9 పట్టణాల్లో కార్యక్రమం నిర్వహించారు. పదో కార్యక్రమం గా , తెలంగాణ లో మొదటి కార్యక్రమంగా హైదరాబాద్ ఇబ్రహీంపట్నం దగ్గర ఉన్న సెయింట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రాంగణంలో స్వతంత్ర స్ఫూర్తి కార్యక్రమం ఏర్పాటు అయింది.

స్వాతంత్ర్య సమరయోధుల స్ఫూర్తితో విద్యార్థులు మంచిగా చదువుకుని తమ కుటుంబానికి, దేశానికి మంచిపేరు తేవాలని సెయింట్ ఎడ్యుకేషనల్‌ సొసైటీ కార్యదర్శి కె.చంద్రశేఖర్‌రెడ్డి ఆకాంక్షించారు. స్వాతంత్ర్య వజ్రోత్సవాలను పురస్కరించుకొని ఇబ్రహీంపట్నంలోని సెయింట్ ఇంజనీరింగ్‌ కాలేజీ, స్వంతంత్ర ఛానెల్‌ సంయుక్తంగా ‘స్వతంత్ర స్ఫూర్తి’ కార్యక్రమాన్ని నిర్వహించాయి.

ఈ సందర్భంగా డాక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. స్వాతంత్ర్య వజ్రోత్సవాల సందర్బంగా ఈ ఏడాది దేశం నలుమూలల చిన్న, పెద్ద.. అందరూ స్వాతంత్స్య ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నామన్నారు.image-1 ప్రతి ఇంటిమీద, ఆఫీసులోనూ జెండాలు ఎగురవేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. స్వాతంత్ర్యం రాకముందు దేశంలో అక్షరాస్యత 4శాతమే ఉండగా, ప్రస్తుతం అక్షరాస్యత 74శాతానికి పెరిగిందన్నారు. విద్య, వైద్యం, ఇతర మౌలిక సదుపాయాలు మనకు లభిస్తున్నాయంటే మహనీయలు అందించిన స్వాతంత్ర్యం చలవేనన్నారు.

మహనీయుల త్యాగఫలమే
ఎంతో మహనీయుల త్యాగఫలంగా భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిందని సెయింట్ ఇంజనీరింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ జి.అనిల్‌కుమార్‌ అన్నారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగంతోimage భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం దేశంగా రూపుదిద్దుకుందన్నారు. అహింస, సహాయ నిరాకరణ ద్వారానే స్వాతంత్ర సమరం జరిగిందన్నారు. మహనీయుల స్ఫూర్తితో కనీసం పదిశాతమైన దేశం కోసం పనిచేయాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.

దేశాభివృద్ధికి కృషిచేద్దాం
దేశం అభివృద్ధి, రక్షణకు ఇంజనీరింగ్‌, ఫార్మశీ రెండు కళ్లు లాంటివని, ఈ రెండు రంగాల్లో శాస్త్రవేత్తలు,విద్యార్థులు మరింత కృషి చేయాలని ఫార్మశీ కళాశాల ప్రిన్సిపాల్‌ హరికృష్ణ ఆకాంక్షించారు. ఆస్తులను, ప్రాణాలను త్యాగం చేసిన మహనీయులను మనం స్మరించుకోవాలని, సమరయోధుల స్ఫూర్తితో మనమంతా ముందుకు సాగాలన్నారు. కార్యక్రమంలో భాగంగా ఇంజనీరింగ్‌, ఫార్మశీ కళాశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.