Home » బిఆర్ ఎస్ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో పడేసి రాష్ట్ర సంపద ప్రజలకు పంచుదాం

బిఆర్ ఎస్ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో పడేసి రాష్ట్ర సంపద ప్రజలకు పంచుదాం

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

ముదిగొండ మండలం యడవెల్లి : దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్య జరుగుతున్న ఎన్నికల సంగ్రామంలో ప్రజల సంపద ప్రజలకు చెందాలంటే ప్రజల తెలంగాణ గెలవాలి. తెలంగాణ ప్రజల కలలను కల్లలుగా చేసిన బిఆర్ ఎస్ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో పడేసి ప్రజల ప్రభుత్వాన్ని గెలిపించి రాష్ట్ర సంపద ప్రజలకు పంచుదాం.

కొట్లాడి కోరి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో బతుకులు బాగుపడతాయని రాష్ట్ర ప్రజలు కలలుగన్నారు.రాష్ట్ర ప్రజల కలలు నిజం చేయడానికి కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. కాంగ్రెస్ ఇచ్చిన తెలంగాణ రాష్ట్రానికి అడ్డంగా నిలబడిన దొరలు బిఆర్ఎస్ ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్న పాలకులు ప్రజల సంపదను లూటీ చేయడంతో ఎలాంటి మార్పు రాలేదు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గారు తెలంగాణలో ప్రజల ప్రభుత్వం గెలవాలని స్పష్టంగా చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఉంటే ఇప్పటికే ప్రాజెక్టులు, ఇండ్లు, ఉద్యోగాలు, మహిళలకు ఆర్థిక సార్ధకత వచ్చి ఉండేది.

రాష్ట్ర ప్రజల అవసరాలు తీర్చడం, భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను ప్రకటించింది.మహిళలకు 500 రూపాయలకే సిలిండర్, ప్రతినెల మహిళలకు 2,500 వారి బ్యాంకు ఖాతాలో జమ చేయడం, మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణం ఇవన్నీ కలిపి నెలకు 5000 రూపాయల వరకు లబ్ధి చేకూర్చే విధంగా కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీ ప్రకటించింది. పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వడంతో పాటు ఇండ్ల నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇస్తాము.

వ్యవసాయ కూలీలకు ఏడాదికి 12,000 ఆర్థిక సాయం చేస్తాము. చదువుకునే యువతకు ఐదు లక్షల క్రెడిట్ కార్డు ఇస్తాము. పేదలకు మెరుగైన వైద్యం అందించడానికి ఆరోగ్యశ్రీని 10 లక్షల రూపాయలకు పెంచుతాం. ప్రతి ఇంటికి 200 యూనిట్స్ వరకు ఉచితంగా కరెంటు అందిస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లో ఈ ఆరు గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేస్తాం. కెసిఆర్ కేటీఆర్ హరీష్ రావులు ప్రజల సంపదను దోపిడీ చేశారు. కాబట్టే ఇలాంటి పథకాలను అమలు చేయలేకపోయారు.

కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ప్రజల సంపద ప్రజలకే ఖర్చు పెడుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో దోపిడీ ఉండదు. నిధుల మిగులు ఉంటుంది.కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీల అమలుకు నిధులు తీసుకురావడానికి రాబడిని ఎక్కడి నుంచి తీసుకురావాలో మాకు తెలుసు.

రైతులకు రుణమాఫీ తో పాటు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ మల్లికార్జున ఖర్గే గారు ప్రకటించిన డిక్లరేషన్స్ మేనిఫెస్టోలో పొందుపరిచి అమలు చేస్తాం.దాచుకొని దోచుకునే బిఆర్ఎస్ పాలకుల వల్ల ప్రజల జీవితాల్లో మార్పు రాలేదు తెలంగాణ. సమాజం నష్టపోయింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే తెలంగాణ వికాసం జరుగుతుంది. యడవెల్లి గ్రామానికి కాంగ్రెస్ ఏమి చేయలేదని బిఆర్ఎస్ నాయకులు మాట్లాడడం వారి అవగాహన రాహిత్యం.

పదేండ్ల బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండి ఒక్క అభివృద్ధి చేసిందా? కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే యడవల్లి అభివృద్ధి చెందింది.మాయ మాటలు చెప్పి ఓట్లు పొందడం తప్ప మధిర నియోజకవర్గానికి బిఆర్ఎస్ చేసింది ఏమీ లేదు. మధిర ప్రజలు వేసిన ఓట్ల వల్ల సిఎల్పీ లీడర్ అయ్యాను. రాష్ట్రంలో 1365 కిలోమీటర్లు పాదయాత్ర చేశాను. మధిర నియోజకవర్గ ప్రజల ఆశీర్వచనం, ప్రజలు ఇచ్చిన బలంతో పాదయాత్ర చేసి రాష్ట్ర ప్రజల సమస్యలు తెలుసుకుని ఏర్పడబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో వాటిని తీర్చ దాంట్లో కీలకంగా ఉండబోతున్నాను.

రాష్ట్ర ప్రజల సమస్యలు పరిష్కరించే పాలించే వాడిగానైనా.. వాటిని పరిష్కరించడానికి ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాడిగానైన ఉండాలి. ఈ రెండు లేని వాళ్ళు ఇక్కడ ఉంటే ఏంటి? లేకుంటే ఏంటి? దళిత బంధు పథకం గురించి ఎనక ముందు తెలియని వారు మాట్లాడితే ఎట్లా?

ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం నిధుల గురించి లెక్కలు తీసి ప్రభుత్వాన్ని నిలదీసి, దళిత మహిళ మరియమ్మ లాకప్ డెత్ కేసులో పోరాడితే వచ్చింది దళిత బంధు పథకం.ప్రశ్నించే వాడిగా ప్రభుత్వం మెడలు వంచి మధిర నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాను మధిర నియోజకవర్గాన్ని ఎప్పుడు పతాక శీర్షికలో ఉంచాను. మధిర పౌరుషం, గౌరవాన్ని ఎక్కడ తగ్గించలేదు.

ఓటు వేసి గెలిపించిన మధిర ప్రజల గౌరవాన్ని మరింత పెంచుతాను. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు మార్చే విధంగా పనిచేస్తాను. ప్రజల సంపద ప్రజలకు అందే విధంగా పనిచేస్తాను నేను చేసే ప్రతి పని సాధించే ప్రతి విషయంలో మధిర ప్రజల ఉమ్మడి విజయమే. మధిర ఓటు వల్ల రాష్ట్ర ప్రజల భవిష్యత్తులో మార్పు తీసుకొస్తాను. కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుంది. ఎన్నికల ప్రచారం ప్రారంభించిన యడవెల్లి గ్రామ అభివృద్ధి రూపు రేఖలు మారుస్తాం.

కాంగ్రెస్ పార్టీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమ కుమార్:
బిఆర్ఎస్ పరిపాలన వ్యతిరేకంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రవచనం వీస్తున్నది.2004లో కాంగ్రెస్ పార్టీ వేసిన ప్రపంచంలో నాటి సీఎల్పీ నేత డాక్టర్ వైయస్సార్ సీఎం అయినట్టుగానే డిసెంబర్ 9న కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటులో భట్టి విక్రమార్క కీలక స్థానంలో ఉంటారు. మధిర నియోజకవర్గంలో అధికార పార్టీ డిపాజిట్ గల్లంతవ్వాలి అత్యధిక మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బట్టి విక్రమార్క గారిని గెలిపించండి.

కాంగ్రెస్ రూపొందించిన ప్రాణహిత చేవెళ్ల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎత్తిపోతల పథకాన్ని రీ డిజైన్ చేసి సీఎం కేసీఆర్ కట్టిన మేడిగడ్డ నిర్మాణం పూర్తిగా అవినీతిమయమయింది.కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో టిఆర్ఎస్ ప్రభుత్వం, లక్ష కోట్ల అవినీతికి పాల్పడింది. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలను ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోనే అమలు చేస్తుంది. చేసి చూపిస్తుంది.

Leave a Reply