అనంత వరదకు లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ పది లక్షలు వితరణ

Spread the love

ఇటీవల కురిసిన అనంతపురం వరదలకు నగర శివారు ప్రాంతాలు జలదిగ్బంధం అయి తీవ్ర ఆస్తి నష్టం వాటిల్లింది. గత వారం లయన్స్ క్లబ్ అనంతపురం ఎలైట్, గుత్తి క్లబ్ నిత్యావసర సరుకులు ఇచ్చి తాత్కాలిక ఉపశమనం కలిగించారు. ప్రసార మాధ్యమాల ద్వారా మరియు స్థానిక క్లబ్ సభ్యుల ద్వారా సమాచారం సేకరించిన లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫండ్ ద్వారా తక్షణం పది వేల డాలర్లు సుమారు ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు గ్రాంటు ఇచ్చినట్లు డిస్ట్రిక్ట్ 316 జె గవర్నర్ జె చంద్ర ప్రకాష్ తెలిపారు.

అలాగే గుత్తి క్లబ్ నుండి డా విరూపాక్ష రెడ్డి యాభై వేలు, రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు రుఖియా బేగం యాభై వేలు, పిడిజి రమేష్నాథ్ రెడ్డి పదివేలు, ఉరవకొండ క్లబ్ ఇరవై ఐదు వేలు, ఆర్ సి బాలచంద్ర పదివేలు, ఎల్లూరి గోపాలకృష్ణ పదివేలు, విడిజి గౌతమ్ పదివేలు, డిజి ఐదువేలు మొత్తం పది లక్షల రూపాయలు లయన్స్ క్లబ్ సేకరించిందని తెలిపారు. అనంతపురం లయన్స్ క్లబ్ మెయిన్, ఎలైట్, గుత్తి, పామిడి, తాడిపత్రి ఉరవకొండ క్లబ్స్ సభ్యులు బాధిత కుటుంబాలను గుర్తించి వారికి నిత్యావసర కిట్లు ప్రధానం చేయనున్నట్లు డిస్ట్రిక్ట్ సర్వీస్ సెక్రెటరీ రమేష్ నాథ్ రెడ్డి తెలిపారు. జిల్లా అధికారులు, స్థానిక ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

Leave a Reply