తాడేపల్లి ప్యాలెస్‌ పెద్దల డైరెక్షన్‌లో మద్యం, లిక్కర్‌ డంప్‌లు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు

రేణిగుంట ఎఫ్‌సీఐ గోడౌన్‌ వద్ద వైసీపీ నేతల ఆధ్వర్యంలో నగదు, మద్యం ప్రచార సామాగ్రికి సంబంధించిన డంప్‌లు బట్టబయలైనా ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటి? ఈ డంప్‌లపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు స్పందించలేదు. ఇలాంటివి 4 డంప్‌లు రేణిగుంటలో ఉన్న విషయం టీడీపీ నేతలు సాక్ష్యాధారాలతో సహా నిరూపిస్తున్నా ఇప్పటివరకు అధికారులు స్పందించకపోవడం వెనుక తాడేపల్లి పెద్ల ఒత్తిళ్లు ఉన్న విషయం వాస్తవం కాదా? కుక్కర్లు, ఫ్యాన్లు, గొడుగులు వంటి 52 రకాల సామాగ్రితోపాటు నగదు కూడా ఉన్నట్లు సమాచారం వస్తున్నా ఇంతవరకు కలెక్టర్‌గానీ, ఆర్‌వో గానీ చర్యలు తీసుకోలేదు.

రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాలకు ఇక్కడి నుంచే మద్యం, మందు, తాయిలాలను పంపిణీ చేసేందుకు వైసీపీ నేతలు చేసిన కుట్రలను సాక్ష్యాధారాలతో సహా బట్టబయలు చేశారు. ఈ డంప్‌ వెనుక ఉన్న ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని చంద్రగిరి అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్‌రెడ్డిపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకుని ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులుగా ప్రకటించాలి. ఈ డంప్‌ వెనుక ఉన్న తాడేపల్లి పెద్దలపై కూడా చర్యలు తీసుకోవాలి.

Leave a Reply