లోగుట్టు పెరమాళ్లకెరుక!

మై డియర్ సర్వే సత్యనారాయణలూ!
అన్నీ ఫేక్సర్వేలే! ఉత్త మూతి ముచ్చట్లు [Mouth Talk] తప్ప, ఓటరు తన మనోగతాన్ని ఇప్పటి వరకు బైట పెట్టలేదనేది ఖాయం! ఎవడిష్టారాజ్యం వాడిది! నాసర్వే నాఇష్టం అన్నట్లు తయారైంది మార్కెట్లో పరిస్థితి! కొందరైతే అసలు ఫీల్డుకే వెళ్లకుండా కంప్యూటర్, ల్యాప్టాపులు, ఈవెన్ మొబైల్ ఫోన్లలో సైతం రిపోర్టులు తయారు చేశారేమో అన్న శంకా లేకపోలేదు! తమకిష్టం వచ్చిన పర్సెంటేజిలు, సీట్లు వేసుకొని, ఏకంగా వాటికి పైడయాగ్రాంలు వేసేసి సర్వేకలరిచ్చి, వాటి తాలూకు రిజల్ట్ కటింగ్ ఇచ్చారేమోననే డౌటానుమానాలు కూడా చెలామణీలో ఉన్నాయి!

అనుకున్నదొకటీ అయినది ఒక్కటీ, బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్ట! తూచ్ నేనొప్పుకోను అంటే కుదరదు! ఇలా జరుగుతుందని నేననుకోలేదనొద్దు! అసలు పరిస్థితి వేరేలా ఉండటంతో ఇంకోలా జరుగుతుందనుకున్నాను! మనం కూడా అదే మాట్లాడుకున్నాం కదా అని కూడా ఎవ్వరూ అనొద్దు, ఇప్పుడే చెప్తున్నా ప్లీజ్!

లోగుట్టు పెరమాళ్లకెరుక! తన మనసులో మాటను చెప్పకుండా, అడిగిన వాళ్లను బట్టి, వాళ్లకు అనుకూలమైన సమాధానం చెప్తూ సర్వే సత్యనారాయణలను తికమక మకతిక పెడుతూ అందరి ఊహలను తలకిందులు చేస్తూ, నమ్మకాలను వమ్ము చేస్తూ, వోకల్ సెక్షన్ అండ్ మేధావుల అంచనాలను బురిడీ కొట్టించడమే ఓటరు మహాశయుడి నైజం! దటీజ్ ది ఓటర్!

వివిధ వేదికలపై జరిగిన చర్చోపచర్చల సారాంశాలు పటాపంచలవడానికి ఇంకెంతా, జస్ట్, 2 రోజులే మిగిలింది! గుంభనంగా ఉంటూ మహామహా సర్వే సత్యనారాయణలకు సైతం, అంతుచిక్కని తెలంగాణా ఓటరునాడి తెలిసిపోయే సమయం ఆసన్నమైంది! ఎల్లుండో మర్నాడో ఓట్ల గుట్టు వీడనుంది!

– సూరజ్ వి. భరద్వాజ్

Leave a Reply