ఇద్దరు ఐఏఎస్ లకు నెలరోజులు శిక్ష

మాములుగా సామాన్యులు ఏదైనా తప్పు చేస్తే కోర్టులు విచారించి తగిన శిక్షలు విధించడం తెలిసిందే. అదే రాజ్యాంగ బద్దంగా చదువుకుని ఎంతో కస్టపడి ఐఏఎస్ పాస్ అయ్యి ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న అధికారి తప్పు చేస్తే, అతనికి హై కోర్ట్ శిక్ష విధిస్తే..? ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇలాంటి ఒక ఘటన జరిగింది.

ఆంధ్ర ప్రదేశ్ లో ఇద్దరు ఐఏఎస్ అధికారులను హై కోర్ట్ నెల రోజుల పాటు శిక్ష విధిస్తూ తీర్పును ఇచ్చింది. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారింది. హై కోర్ట్ ఇచ్చిన ఆదేశాలను ధిక్కరించినందుకు గాను వీరిపై ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్ లు శ్యామలరావు మరియు పోలా భాస్కర్ లకు న్యాయస్థానం శిక్షను విధిస్తూ వీరికి వెయ్యి రూపాయలు జరిమనను కూడా విధించడం గమనార్హం. ఇక శిక్ష పడిన వీరిద్దరూ డిసెంబర్ 8 లోగా రిజిస్ట్రార్ వద్ద లొంగిపోవాలని తెలిపింది.

Leave a Reply