కాంగ్రెస్‌ను గెలిపించడమే ‘కమ్మ’ల ధ్యేయం

– కమ్మ కుల ఆత్మగౌరవానికి ఒక అగ్నిపరీక్ష, క్షాత్ర పరీక్ష
( కొల్లి కోటేశ్వరరావు )

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించడమే కమ్మ వర్గ ధ్యేయంగా కనిపిస్తోంది. ఆ మేరకు పలు వాట్సాప్ గ్రూపులలో ఆ సామాజికవర్గ ఔత్సాహికులు పెడుతున్న పోస్టులు చర్చనీయాంశంగా మారాయి. ఇది చదివితే బీజేపీ-బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ గెలుపు కోసం కమ్మ వర్గం ఎంత కష్టపడుతోందో స్పష్టమవుతుంది.

సమయం లేదు మిత్రమా.!
ఈ తెలంగాణా ఎన్నికలు…. తెలంగాణాలోనే కాకుండా, మొత్తం ప్రపంచంలోనే కమ్మకుల ఆత్మగౌరవానికి ఒక అగ్నిపరీక్ష, క్షాత్ర పరీక్ష.
సంధికి, మొఖమాటాలకూ, బంధుత్వాలకు, కులాభిమానానికి అస్సలు తావేలేదు మిత్రమా.!
మన కమ్మకులానికి మొత్తానికి ప్రధమ శత్రువు తెరాస/భారాస/కేసీఆర్&కో మాత్రమే మిత్రమా.!

మనకు ద్వితీయ శత్రువు వైఎస్సార్సీపీ/వైఎస్ కుటుంబం. తృతీయ శత్రువు మోడీ, అమిత్ షా ల నేతృత్వంలోని బీజేపీ. ఈ ఎన్నికల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ మన కమ్మకులమంతా ఏకత్రాటి మీద, ఓకేమాట మీద నిలబడి, ఎలాంటి మొఖమాటాలకు తావులేకుండా, స్థానికంగా బీఆరెస్, బీజేపీ తరపున నిలబడిన అభ్యర్థులు మన కమ్మ కులస్తులైనాసరే ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించేదే లేకుండా ఓడించాలి, మనం బీఆరెస్- బీజేపీ వాళ్లకు వ్యతిరేకంగా ఓట్లేయాలి.

మనమంతా ఏకగ్రీవంగా కాంగ్రెసు పార్టీ అభ్యర్థులకు ఓట్లేసి మన ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పాలి. ఈ ఎన్నికల ద్వారా మన కమ్మకుల సంఘటిత శక్తిని ప్రపంచానికి, కాంగ్రెసుపార్టీ అధిష్టానానికి వెలుగెత్తిచూపాలి, మనం ఎల్లప్పుడూ ప్రజాస్వామ్యంవైపే నిలబడి ఉంటామని, పీడితతాడిత బడుగుబలహీన దళిత గిరిజన మైనారిటీ వర్గాలవైపే మనం అండగా నిలబడి ఉంటామని మన ఓటు ద్వారా యావత్తు తెలంగాణా ప్రజానీకానికి తెలియాలి.

తెలంగాణా రాష్ట్రంలో ఎక్కడైనా సరే, ఏ నియోజకవర్గంలో అయినాసరే…, అక్కడ బీఆరెస్ తరపున నిలబడిన మన కమ్మకులానికి చెందిన అభ్యర్థులు మన కమ్మవారు అయినాసరే, ఆ నియోజకవర్గాల పేర్లతో పనిలేదు.

వాళ్లకు మనకు ఉన్న బంధుత్వాలు స్నేహాలతో వ్యాపారభాగస్వామ్యాలతో పనిలేదు, అక్కడ మన కళ్ళకు ఎదురుగా కనిపించాల్సింది మన ప్రధానశత్రువులైన కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కవిత ల ఫోటోలు మాత్రమే, మన ఓటు నొక్కాల్సింది హస్తం గుర్తు మీటమీద(బటన్ మీద) మాత్రమే, కొత్తగూడెంలో సీపీఐ గుర్తు మీద మాత్రమే మనం ఓట్లు వేయాలి.

చంద్రబాబు నాయుడు పేరుతో, మనం బీఆరెస్ కి ఓట్లెయాలని, బీఆరెస్ నుండి పోటీచేస్తున్న మన కమ్మ కులానికి చెందిన అభ్యర్థులకు మన ఓట్లెయాలిని వాళ్ళను గెలిపించాలని కమ్మకులసంఘాల పేరుతో, ఆత్మీయసమావేశాల పేరుతో ప్రచారంచేస్తూ, మనల్ని గందరగోళానికి గురిచేయాలని ప్రయత్నిస్తున్నారు. వాళ్ళల్లో కొందరు మన కులంలోని వాళ్లే, కేసీఆర్ కుటుంబానికి తొత్తులుగా బానిసలుగా మారినవాళ్ళు, హైదరాబాదులో అక్రమ రియలేస్టేట్ వ్యాపారంలో అక్రమంగా అన్యాయంగా అడ్డగోలుగా సంపాదించినవాళ్ళు ఇలా ప్రచారం మొదలుపెట్టారు, వాళ్లపట్ల జాగ్రత్త, వాళ్ళ మాయమాటల వలలో పడమాకండి. కాంగ్రెసు పార్టీకే ఓట్లెయండి, ఓట్లు వేయించండి.

తెలంగాణాలో నలుమూలల ఉన్నటువంటి ఆత్మీయ కమ్మ సోదరసోదరీమణులారా ఏకంకండి, ముందుకు కదలండి, నవంబరు 30 వ తేదీన మన ఓట్లతో పాటు, మన ఇరుగుపొరుగు వారి ఓట్లను కూడా కాంగ్రెసు అభ్యర్థులకు, హస్తం గుర్తుపై ఓటు వేయించండి, మన ఓట్లతో మన బలం చూపిద్దాం, మనం విజయంలో, మార్పులో భాగం అవుదాం.

Leave a Reply