– టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
జగన్ మోసపు రెడ్డి మాటలు కోటలు దాటతాయి…చేతలు తాడేపల్లి ప్యాలస్ కాంపౌండ్ కూడా దాటవు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బస్సు ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.5 లక్షలు పరిహారం
ఇవ్వడమేమిటి? కనీసం రూ.20 లక్షలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు చిత్తూరు జిల్లా బాకరపేట సమీపంలో జరిగిన బస్సు ప్రమాదంలో చనిపోయిన 9 మంది కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్ గ్రేషియా ఇచ్చి చేతులు దులుపుకోవాలని చూస్తున్నారు. మేము కొత్త డిమాండ్లు ఏమి పెట్టడం లేదు ఆనాడు మీరు ఇచ్చిన హామీ నెరవేర్చాలని అడుగుతున్నాం.