– మంత్రికి రాష్ట్ర పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ప్రతినిధుల కృతజ్ఞతలు
మంగళగిరి: కోస్తారికా రాజధాని శాన్ జోస్ లో సెప్టెంబర్ 3వ తేదీ వరకు జరుగనున్న వరల్డ్ సబ్ జూనియర్, జూనియర్ పవర్ లిఫ్టింగ్ పోటీలకు మంగళగిరికి చెందిన అంతర్జాతీయ మహిళా పవర్ లిఫ్టర్ సాదియా ఆల్మస్ బయలుదేరి వెళ్లినట్టు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు కొమ్మాకుల విజయభాస్కరరావు, ప్రధాన కార్యదర్శి షేక్ సంధానీ సంయుక్త ప్రకటనలో తెలిపారు.
ఈ పోటీల్లో పాల్గొనేందుకు అంతర్జాతీయ మహిళా పవర్ లిఫ్టర్ షేక్ సాదియా ఆల్మస్ కు ఇటీవల నియోజకవర్గ ఎమ్మెల్యే, రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ తన సొంత నిధులతో ఫ్రైడ్ ఆఫ్ మంగళగిరి పేరుతో రూ.2.50 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించిన విషయం విదితమే. అంతర్జాతీయ జూనియర్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో షేక్ సాదియా అల్మాస్ మంచి ప్రతిభ కనబర్చి బంగారు పతకంతో దేశానికి, రాష్ట్రానికి, జిల్లాకు, ప్రత్యేకంగా మంగళగిరి కి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
ఫ్రైడ్ ఆఫ్ మంగళగిరి పేరుతో ప్రతిభ ఉన్న ప్రతి ఒక్క క్రీడాకారునికి తమ సొంత నిధులతో ఆర్థిక సహాయం అందిస్తున్న మంత్రికు జిల్లా, రాష్ట్ర పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షులు గంటా వెంకటేశ్వరరావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ సకల కోటేశ్వరరావు, జిల్లా పవన్ లిఫ్టింగ్ అసోసియేషన్ వైస్ చైర్మన్ ఆర్.ఎన్. వంశీకృష్ణ తదితరులు మంత్రి లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపిన వారిలో ఉన్నారు.