– నారా లోకేష్‌ను ఎదుర్కొవడం ఎవ్వరి వల్ల సాధ్యం కాదు
– నిరుపేద కుటుంబాలకు తోపుడు బండ్లు అందచేసిన విజయవాడ ఎమ్మెల్యే గద్దె రామమోహన్
విజయవాడ: 175 అసెంబ్లీ సీట్లలో కూటమి ప్రభుత్వానికి 164 సీట్లు పొందడంలో నారా లోకేష్ నిర్వహించిన యువగళం పాదయాత్ర పాత్ర చాలా ఉందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ చెప్పారు.
నారా లోకేష్ చేపట్టిన పాదయాత్ర రెండు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా సోమవారం ఉదయం తూర్పు నియోజకవర్గం 13వ డివిజన్ కు చెందన ఎం.డి.కరిముల్లా, బొజ్జర్లపూడి సుమలతలకు స్వయం ఉపాధి చేసుకునే నిమిత్తం రూ.30 వేలు విలువ చేసే రెండు తోపుడు బండ్లను ఎమ్మెల్యే గద్దె రామమోహన్ తన సొంత నిధులతో కోనుగోలు చేసి వారికి ఉచితంగా అందచేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్ మాట్లాడుతూ.. నారా లోకేష్ యువగళం పాదయాత్ర చేపట్టి నేటికి రెండు సంవత్సరాలు పూర్తి అయ్యాయని చెప్పారు. యువగళం పాదయాత్ర ద్వారా తెల్సుకున్న సమస్యలను పరిష్కరించడం కూడా జరుగుతోందన్నారు. తెలుగుదేశం పార్టీకి మరో యాభై సంవత్సరాలు పాటు నాయకత్వానికి ఢోకా లేదని నారా లోకేష్ నిరూపించారని చెప్పారు.
యువగళం పేరుతో ప్రజలను సమీకరించి ఒక ఉద్యమం మాదిరిగా నిర్వహించారని అన్నారు. యువగళం పాదయాత్ర తర్వాత నారా లోకేష్‌ను ఎదుర్కోవడం ఏవరి వల్ల సాధ్యం కాదని స్పష్టమైందన్నారు. 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 164 సీట్లు కూటమి అభ్యర్థులు గెలుపొందారంటే నారా లోకేష్ చేసిన యువగళం పాదయాత్ర పాత్ర చాలా ఎక్కువగా ఉందన్నారు.