Suryaa.co.in

Andhra Pradesh

దావోస్ పర్యటనతో ఏపీలో పరిశ్రమలు

– ఏపీ.ఐ.ఐ.సీ చైర్మన్ మంతెన రామరాజు

భీమవరం: ఎన్డీఏ కుటమి ప్రభుత్వ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర, రాష్ట్ర మంత్రులు నారా లోకేష్ తో పాటు దావోస్ లో పర్యటించిన ప్రజా ప్రతినిధులకు అధికారులకు ఏపీ.ఐ.ఐ.సీ చైర్మన్ పశ్చిమగోదావరి జిల్లా తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు మంతెన రామరాజు ధన్యవాదాలు తెలిపారు.

దావోస్ పర్యటనను జీర్ణించుకోలేని వైసీపీ నాయకులు అసత్య ప్రచారాలతో పెట్టుబడిదారులను భయపెట్టి దారి మళ్లించే ప్రయత్నం చేయటం అవివేకం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున నారా లోకేష్ సరికొత్త ప్రణాళికతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో భవిష్యత్తు తరాలవారికి ప్రపంచ దేశాలతో పాటు రాష్ట్రంలోనే ఉపాధి అవకాశాలు లభించాలనే ఉద్దేశంతో నిస్వార్ధంగా నీతి నిజాయితీతో పని చేస్తున్నారన్నారు.

జనవరి 27వ తేదీన కుప్పంలో మొదటి అడుగుతో యువగళం నవశకం పేరుతో నిర్వహించిన పాదయాత్ర నేటికి రెండు సంవత్సరాల పూర్తయ్యాయని గుర్తు చేశారు.భవిష్యత్ తరాల కోసం ప్రణాళిక బద్ధంగా పనిచేస్తున్న నారా లోకేష్ కు మంచి భవిష్యత్తు ఉందని త్వరలోనే ఏపీకి అనేక పరిశ్రమలు రానున్నాయని తెలిపారు.

LEAVE A RESPONSE