*అరాచక పాలకుల్లో భయం పుట్టించిన యువగళం
*ఏపీలో సరికొత్త అధ్యాయం సృష్టించిన యువగళం పాదయాత్ర
*ప్రజాప్రభుత్వాన్ని స్థాపించడంలో యువగళం కీలకపాత్ర
*వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సు లో బ్రాండ్ ఏపీని ప్రమోట్ చేసిన యువనేత
ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని)
విజయవాడ : ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్నిదోచుకుతింటూ, అప్పుల ఊబిలోకి రాష్ట్రాన్ని నెట్టి ప్రజాకంఠక పాలన చేసిన జగన్ సర్కార్ పై విద్య,ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ 2023 జనవరి 27వతేదీ పూరించిన సమర శంఖం యువగళం పాదయాత్ర. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం, రాష్ట్రాభివృద్ది కోసం లోకేష్ చేపట్టిన మహాయజ్ఞం యువగళం పాదయాత్ర అని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) అన్నారు.
యువగళం పాదయాత్ర రెండేళ్లు పూర్తి చేసుకోవటంతో పాటు, మంత్రి నారా లోకేష్ వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సు లో పాల్గొని దావోస్ పర్యటన విజయవంతంగా ముగించుకొని వచ్చినందుకు ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం, ఎన్టీఆర్ భవన్ లో సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎంపి కేశినేని శివనాథ్ మాట్లాడుతూ 226 రోజులపాటు 3132 కి.మీల మేర సాగిన యువగళం పాదయాత్రలో మంత్రి లోకేష్ ప్రకాశం బ్యారేజీ దగ్గర 2,500 కి.మీ మైలరాయిని ఆవిష్కరించారని గుర్తు చేసుకున్నారు..ఉమ్మడి కృష్ణా జిల్లాలో 2023లో ఆగస్టు 19, 20, 21 వతేదీల్లో మూడు రోజుల పాటు సాగిన యువగళం పాదయాత్రకి ప్రజలు బ్రహ్మారథం పట్టగా, గన్నవరంలో నిర్వహించిన బహిరంగ సభకు జనం ఒక ప్రభంజనంలా తరలిరావటంతో వైసిపి గుండెల్లో రైళ్లు పరిగెత్తాయన్నారు.
రాష్ట్రంలోని 11 ఉమ్మడి జిల్లాల్లో97 అసెంబ్లీ నియోజకవర్గాలు,232 మండలాలు/మున్సిపాలిటీలు, 2,097 గ్రామాల మీదుగా 226 రోజులపాటు 3132 కి.మీ.ల మేర యువగళం పాదయాత్రలో మంత్రి నారా లోకేష్ జగన్ సర్కార్ ను, వైసిపి నాయకుల అవినీతిని సవాల్ చేయటంతో అరాచక పాలకుల్లో భయం పుట్టించిందన్నారు.