Suryaa.co.in

Telangana

ఇది బ్రిటిష్ జనతా పార్టీ

– రాజ్యాంగాన్ని మార్చాలని మోదీ ప్రయత్నిస్తున్నారు
– ఇది ఎన్నికల ర్యాలీ కాదు… ఇది ఒక యుద్ధం
– ఒకటి గాంధీ పరివార్… మరొకటి గాడ్సే పరివార్
– మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో జాతీయ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన “జై బాపు, జై భీమ్, జై సంవిధాన్” ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ఇండోర్: రాజ్యాంగ పరిరక్షణకు రాహుల్ గాంధీ గారితో కలిసి మనం ఈ పోరాటం చేస్తున్నాం. ఇది ఎన్నికల ర్యాలీ కాదు… ఇది ఒక యుద్ధం.ఈ యుద్ధం రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాడేవారికి, రాజ్యాంగాన్ని మార్చాలనుకునేవారికి మధ్య జరుగుతోంది. ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రాజ్యాంగాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు.రాహుల్ గాంధీ ఈ విషయాన్ని ముందుగానే గుర్తించి రాజ్యాంగ పరిరక్షణకు పోరాడుతున్నారు.

గజనీ మహమ్మద్ హిందుస్తాన్ ను దోచుకోవడానికి ప్రయత్నించినట్లు రాజ్యాంగాన్ని మార్చాలని మోదీ ప్రయత్నిస్తున్నారు. కానీ ఆయన ప్రయత్నం ఫలించడం లేదు. ఎందుకంటే ఆనాడు బ్రిటిషర్ల నుంచి మహాత్మా గాంధీ దేశాన్ని రక్షించినట్లు.. భారతీయ జనతా పార్టీ పేరుతో చలామణీ అవుతున్న బ్రిటిష్ జనతా పార్టీని ఎదుర్కొనేందుకు రాహుల్ గాంధీ నిలబడ్డారు. ఈ యుద్ధంలో మనమంతా రాహుల్ గాంధీతో కలసి నడవాలి.

రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు మనమంతా కలిసికట్టుగా పోరాడాలి. ఇది రెండు పరివార్ ల మధ్య జరుగుతున్న యుద్ధం. ఒకటి గాంధీ పరివార్… మరొకటి గాడ్సే పరివార్. గాడ్సే పరివార్ వైపు నుంచి మోదీ…గాంధీ పరివార్ వైపు నుంచి రాహుల్ గాంధీ పోరాడుతున్నారు. అందుకే మనమంతా గాంధీ పరివార్ గా రాహుల్ గాంధీకి మద్దతుగా నిలవాలి. రాహుల్ గాంధీ నేతృత్వంలో దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రాజ్యాంగాన్ని పరిరక్షించాలి.

భ‌క్తుల‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నాగోబా జాత‌ర శుభాకాంక్ష‌లు

దేశంలోనే రెండో అతి పెద్ద గిరిజ‌న జాత‌రైన నాగోబా జాత‌ర సంద‌ర్భంగా భ‌క్తుల‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్ష‌లు తెలిపారు. మెస్రం వంశ‌స్థుల ఆధ్వ‌ర్యంలో జ‌రిగే నాగోబా జాతరను అయిదు రోజుల పాటు వేడుక‌గా సాగుతుంద‌ని, భ‌క్తులు నాగోబాను ద‌ర్శించుకొని ఆశీస్సులు అందుకోవాల‌ని ముఖ్య‌మంత్రి ఆకాంక్షించారు. అధికారికంగా నిర్వ‌హిస్తున్న జాత‌ర‌కు అవ‌స‌ర‌మైన అన్ని ఏర్పాట్ల‌ను అధికారులు పూర్తి చేశార‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి వెల్ల‌డించారు.

LEAVE A RESPONSE