Suryaa.co.in

Andhra Pradesh

దావోస్ పర్యటనతో చరిత్ర సృష్టించాం

– పెట్టుబడుల సునామీతో ఆంధ్రప్రదేశ్ పరుగుల పెట్టనుంది
– ప్రపంచ దిగ్గజ సంస్థలు ఏపీ వైపు చూస్తున్నాయి
– నాలుగు రోజుల్లో 50కి పైగా కంపెనీలతో భేటీ అయిన విజనరీ లీడర్స్ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ : మంత్రి వాసంశెట్టి సుభాష్
– ఎముకలు కొరికే చలిలో సడలని సంకల్పతో అధినేత ముందుకు
– కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్

అమరావతి: దావోస్ పెట్టుబడుల సమీకరణలో ఆంధ్రప్రదేశ్ అరుదైన రికార్డులు సొంతం చేసుకుందని ఏపీ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. కేవలం నాలుగు రోజుల వ్యవధిలో 50 కి పైగా కంపెనీల ప్రతినిధులతో ఒప్పందాలు చేసుకొని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ మంత్రి నారా లోకేష్ నేడు చరిత్ర సృష్టించారన్నారు.

ఇక నుంచి ఉత్తరాంధ్ర,రాయలసీమ,కోస్తా ఆంధ్ర మూడు ప్రాంతాలలు అభివృద్ధితో పరుగులు పెట్టనున్నాయన్నారు. దావోస్ చేరుకున్న విజనరీ లీడర్ నారా చంద్రబాబుకు రెడ్ కార్పెట్ తో స్వాగతం పలికిన పారిశ్రామికవేత్తలు ఏపీలో పెట్టుబడులు అనేక ఒప్పందాలు కుదుర్చుకోవడం శుభ పరిణామని మంత్రి అన్నారు. ప్రధానంగా రాష్ట్రంలో ఉన్న మౌలిక వసతులు,సదుపాయాలు, అపార వనరులను తమ ఆలోచన మేదస్సుతో ప్రపంచ దేశాలకు పరిచయం చేసి.. దిగ్గజ కంపెనీలను ఏపీ వైపు చూసేలా ముఖ్యమంత్రి చేసిన కృషి అభినందనీయమని మంత్రి చెప్పారు.

రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలను యువతకు కల్పించాలనే దృడకల్పంతో ఏడు పదుల వయసులో ఎముకల కొరికే చలిలో దావోస్ విధుల్లో పర్యటించిన అపర చాణిక్యుడు మన ఏపీ ముఖ్యమంత్రి అని గుర్తుచేశారు. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్, టాటా చైర్మన్ చంద్రశేఖరన్ వంటి ప్రపంచ దిగ్గజాలు చంద్రబాబు ఆలోచనతో ముందుకు వస్తున్నారంటే మన అధినాయకుడి మేదస్సు ఎంత గొప్పదో ఇట్లే అర్థమవుతుందన్నారు.

2019కు ముందు బ్రాండ్ ఏపీ గా ఉన్న మన రాష్ట్రాన్ని బిల్డప్ ఏపీ గా మార్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పారు. పారిశ్రామికరణలో ప్రపంచ దేశాలు ఏపీ వైపు చూసి.. తెలుగువారి గొప్పతనం చాటేలా నిరంతరం శ్రమిస్తున్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని రాష్ట్ర ప్రజలు అభినందించాల్సిన అవసరం కచ్చితంగా ఉందని మంత్రి కోరారు.

LEAVE A RESPONSE