– ఇప్పుడు ఆ మీటర్లు పెడుతుంటే అడ్డుకోరేం?
– విద్యుత్ అమర వీరుల స్పూర్తితో విద్యుత్ స్మార్ట్ మీటర్ల పై పోరాడుతాం
– సీపీఎం జిల్లా కార్యదర్శి జి కోటేశ్వరరావు
విశాఖ: విద్యుత్ సంస్కరణలను వ్యతిరేకిస్తూ 2000 సంవత్సరంలో చలో హైదరాబాద్ నిర్వహించిన ప్రజలపై చంద్రబాబు ప్రభుత్వం పోలీసులు కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో బాలస్వామి, సత్తెనపల్లి రామకృష్ణ, విష్ణువర్ధన్ రెడ్డి ముగ్గురు యువకిశోరాలను అప్పటి ప్రభుత్వం పోట్టణ పెట్టుకుంది. నేటికీ 25 సంవత్సరాలు అయింది. వారు త్యాగాన్ని గుర్తు చేస్తూ లంకెలపాలెం జంక్షన్ లో ఘనంగా నివాళులర్పించడం జరిగింది.
ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి జి కోటేశ్వరరావు మాట్లాడుతూ, ఆనాడు విద్యుత్ సంస్కరణలపై పోరాడి ప్రజలపై భారం పడకుండా విజయం సాధించారు. నేడు కేంద్రంలో బిజెపి ప్రభుత్వం మళ్ళీ విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చి పేద, బడుగు బలహీన ,మధ్య తరగతి ప్రజలపై స్మార్ట్ మీటర్ల పేరుతో విద్యుత్తు చార్జీలు సర్దుబాటు చార్జీలు పేరుతో ప్రజలను మరింత దోపిడీ చేయడం కోసం స్మార్ట్ మీటర్లు పెడుతుంది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు స్మార్ట్ మీటర్లు పెడితే పగలగొట్టండి అని లోకేష్ నినాదం ఇచ్చారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక షాపులకి స్మార్ట్ మీటర్లు పెట్టారు వీటిని వెంటనే ఉపసరించుకోవాలని, లేదంటే ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గని శెట్టి సత్యనారాయణ, అప్పారావు, వెంకట్రావు, గంగరాజు, రమణ, తదితరులు పాల్గొన్నారు.