మేనమామనని చెప్పిన జగన్‌రెడ్డి కంసమామయ్యారు

– ఎయిడ్ సంస్థ‌ల ఆస్తుల‌పై క‌న్ను
– పెద్దకూరపాడు లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
పెద్దకూరపాడు పోలీస్ స్టేషన్ లో టిఎన్ఎస్ఎఫ్ నేతలను పరామర్శించిన అనంతరం లోకేష్, టీడీపీ ఎమ్మెల్యేలు పోలీసుస్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేష్ వైసీపీ సర్కారుపై నిప్పులు కురిపించారు.ఆయనేమన్నారంటే.. మేనమామగా ఉంటానన్న జగన్ కంసుడిలా మారి విద్యార్థుల పై లాఠీ ఛార్జ్ చేయిస్తున్నారు. ఎయిడెడ్ విద్యా సంస్థలను ప్రైవేటీకరణ చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసన

తెలిపితే పోలీసులు టిఎన్ఎస్ఎఫ్ నాయకుల పట్ల దారుణంగా వ్యవహరించారు. బాత్ రూం దగ్గర కూర్చోబెట్టి ఆహారం కూడా ఇవ్వకుండా 8 గంటలు నిర్బంధించారు.
1854 లోనే ఎయిడెడ్ వ్యవస్థ ఏర్పడింది.పేద విద్యార్థులకు అండగా నిలబడటానికి దాతలు, ప్రభుత్వాలు ముందుకు వచ్చాయి.ఎన్టీఆర్ గారు, వెంకయ్యనాయుడు గారు, జస్టిస్ రమణ గారు, బలయోగి గారు ఆఖరికి జగన్ రెడ్డి తండ్రి వైఎస్ గారు, రోశయ్య గారు ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది ఎయిడెడ్ విద్యా సంస్థల్లో చదువుకొని ఉన్నత స్థానాల్లో ఉన్నారు.
ఎయిడెడ్ విద్యా వ్యవస్థని నాశనం చేస్తూ జగన్ రెడ్డి జిఓ 19,42,50,21 తీసుకొచ్చారు. రెండే అప్షన్లు ఇచ్చారు. ఒకటి ఉపాధ్యాయులను, ఆస్తులను ప్రభుత్వానికి ఇవ్వడం. రెండు ప్రైవేటీకరణ జిఓ లో లేని మూడో అప్షన్ ఉందని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టాలని చూశారు. ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమించడంతో ఇప్పుడు మెమో పేరుతో మరో కొత్త డ్రామా మొదలుపెట్టారు.
అనంతపురం, కాకినాడ ఈ రోజు విజయనగరంలో ఎయిడెడ్ విద్యా సంస్థలు కాపాడండి అంటూ శాంతియుతంగా నిరసన తెలిపిన విద్యార్థుల పై లాఠీ విరిగింది. ఎయిడ్ సంస్థ‌ల ఆస్తుల‌పై క‌న్ను వేశారు. ఆస్తులు కొట్టేసేందుకు అనేక వ్యూహాలు రచిస్తున్నారు.రాష్ట్ర వ్యాప్తంగా ఎయిడెడ్ సంస్థ‌ల ప‌రిధిలో 2,203 పాఠశాలల్లో 1,96,313 మంది విద్యార్ధులు చ‌దువుతున్నారు. 182 జూనియర్ కాలేజీల్లో 71,035 మంది విద్యార్ధులున్నారు. 116 డిగ్రీ కాలేజీల్లో చ‌దివే విద్యార్థుల భవిష్యత్ ప్రశార్ధకంగా మారుతుంది. ఎయిడెడ్ సంస్థ‌ల్లో చ‌దువుతున్న విద్యార్థుల్లో 90 శాతం మంది నిరుపేద విద్యార్థులే.
ల‌క్ష‌లాది పిల్ల‌ల చ‌దువు కంటే ఎయిడెడ్ సంస్థలకు వున్న‌ లక్ష కోట్ల విలువైన భూములు, ఆస్తులే జ‌గ‌న్‌రెడ్డికి ముఖ్య‌మ‌య్యాయి.ప్రైవేటీకరణ వల్ల పేద తల్లిదండ్రులపై పెను భారం పడుతుంది. పేద విద్యార్థులను విద్యకు దూరం చేసేలా ఇచ్చిన జిఓ లు ఉపసంహరించుకోవాలి.
మెమోలు,ఆప్షన్ల డ్రామాలు ఆపి తక్షణమే జిఓ 19,42,50,51 రద్దు చెయ్యాలి.ఎయిడెడ్ విద్యా వ్యవస్థ ని నాశనం చేస్తూ తెచ్చిన జిఓ లు రద్దు చేసే వరకూ ఉద్యమం ఆగదు.

Leave a Reply