టీడీపీ నేతలు గుడికి వెళుతుంటే అరెస్టులా?

Spread the love

-జగన్ పాపం పండింది….వైసీపీ ప్రభుత్వానికి మూడింది..అందుకే ఇలాంటి పోకడలు
-దేశ విదేశాల నుంచి మద్ధతు….చంద్రబాబు సత్తాకు నిదర్శనం
-టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్

నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుపై పార్టీ, ప్రజలు చేపట్టిన కార్యక్రమాలను చూసి ప్రభుత్వం వణికిపోతోందని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. చంద్రబాబుపై ప్రభుత్వ కుట్రలు విఫలం కావాలని….అధినేతకు మంచి జరగాలని దేవాలయాల్లో పూజలకు వెళుతున్నవారిని కూడా రాష్ట్ర వ్యాప్తంగా అడ్డుకోవడంపై లోకేష్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

గుడికి వెళుతుంటే కూడా అర్థం లేని నిబంధనలతో అడ్డుకోవడం, అరెస్ట్ చేయడం జగన్ పిరికితనానికి నిదర్శనం అన్నారు. జగన్ పాపం పండిందని….వైసీపీ ప్రభుత్వానికి మూడిందని లోకేష్ మండి పడ్డారు. తెలుగుదేశం నేతలు, ప్రజలు గుడికి వెళ్లాలో వద్దో కూడా జగన్ నిర్థేశిస్తారా అని ప్రశ్నించారు. ముందస్తు అరెస్టులు, గృహ నిర్భంధాలతో నిరసనలను, చంద్రబాబుకు వస్తున్న మద్ధతును అడ్డుకోలేరని లోకేష్ అన్నారు.

దేశ విదేశాల నుంచి మద్దతు….చంద్రబాబు సత్తాకు నిదర్శనం!

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుపై దేశ, విదేశాల్లో సైతం వెల్లువెత్తుతున్న నిరసనలు ఆయన పాలనకు, ప్రజాసేవకు నేడు అద్దం పడుతున్నాయని నారా లోకేష్ అన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టును నిరససిస్తూ అనేక ప్రాంతాల్లో జరుగుతున్న దీక్షలు, నిరసనలు, ర్యాలీలు చంద్రబాబు నిష్కళంక చరిత్రను చాటి చెబుతున్నాయని లోకేష్ అన్నారు.

కేవలం ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో, ఇతర దేశాల్లోని అనేక నగరాల్లో జరగుతున్న మద్ధతు ర్యాలీలు…. 45 ఏళ్లగా చంద్రబాబు చేసిన అభివృద్ధి రాజకీయాలకు నిదర్శనమని లోకేష్ అన్నారు. ఒక మాజీ ముఖ్యమంత్రి అరెస్టుపై ఇన్ని రాష్ట్రాల్లో, ఇన్ని దేశాల్లో నిరసనలు జరిగిన సందర్భం, ఇంత స్థాయిలో స్పందన వచ్చిన ఘటన మరొకటి లేదని లోకేష్ అన్నారు. హైదరాబాద్, ఖమ్మం, నిజామాబాద్, నల్గొండ సహా తెలంగాణలోని అనేక జిల్లాల్లో, మహారాష్ట్ర, కర్ణాటకలోని బళ్లారిలో అభిమానులు స్వచ్ఛందంగా బయటకు వచ్చి మద్దతు తెలపడంపై లోకేష్ ధన్యవాదాలు తెలిపారు.

రాజకీయాలకు, పార్టీలకు సంబంధం లేని వివిధ వర్గాల ప్రజలు బయటకు వచ్చి మద్ధతు ప్రకటించడం తమకు ఎంతో ధైర్యాన్నిస్తుందని…వారందరికీ తమ కుటుంబం నుంచి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను అన్నారు. చంద్రబాబు నాయుడి పాలసీల కారణంగా లబ్ది పొందిన వర్గాలు నేడు పెద్ద ఎత్తున మద్ధతు పలుకుతున్నాయని….ఇదీ చంద్రబాబు క్రెడిబిలిటీ అంటే అని లోకేష్ అభిప్రాయపడ్డారు.

Leave a Reply