నీలం సహానీని విచారిస్తే సీఐడీ చీఫ్ కు కార్పొరేషన్ పుట్టుక అక్రమమో.. సక్రమమో తెలుస్తుంది
• స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ పుట్టుకే అక్రమమంటున్న సీఐడీ చీఫ్ సంజయ్.. నీలం సహానీ ఇచ్చిన జీవోలు 47, 48, గవర్న్ మెంట్ ఆఫ్ఇండియా ఇన్ కార్పొరేషన్ సర్టిఫికెట్ పై ఏం సమాధానం చెబుతాడు?
• స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఏర్పాటులో రెండు జీవోలు స్వయంగా ఇచ్చి, కీలక భూమిక పోషించిన విశ్రాంత ఐఏఎస్ అధికారి, నేటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అయిన
• కార్పొరేషన్ ఏర్పాటుకు అవసరమైన నిధులు విడుదల చేసిన అజయ్ కల్లం రెడ్డి గారిని అడిగినా సరే మీకు మరింత సమాచారం అందచేస్తారు.
• సంజయ్ మనరాష్ట్ర రాజధాని, పొరుగు రాష్ట్ర రాజధాని, దేశ రాజధానిలో అబద్ధాలు చెప్పడం అయిపోయింది. ఇక ఆయన తదుపరి మీడియా సమావేశం చంద్రమండలం మీదే అనుకుంటా!
• ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ‘ఇదర్ ఆయియే’ వ్యాఖ్యలు విన్నాక హాస్యనటులు కూడా ఆయన ముందు దిగదుడుపేనని అర్థమైంది
– టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి రామ్
జగన్ రెడ్డి, అతని చేతిలో తోలుబొమ్మలుగా మారిన వ్యవస్థలు, అధికారులు స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ యొక్క ఆశయాన్ని నీరుగారుస్తూ, ఏదో రకంగా చంద్రబాబుని దోషిగా చూపాలన్న పట్టుదలతో రోజుకో ప్రాంతంలో విలేకరులతో మాట్లాడుతూ, చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి ఎనలేని అవస్థలు పడుతున్నారని, టీడీపీ ఎప్పటి కప్పుడు వాస్తవాలను ప్రజలముందు పెడుతోందని, ఆ క్రమంలో తాజాగా స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ పుట్టుక యొక్క వాస్తవాలను ప్రజల ముందు ఉంచామని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు.
మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే మీకోసం…
“ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ పుట్టుకపై ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ చెప్పిందంతా నూటికి నూరుశాతం పచ్చి అబద్ధం. కార్పొరేషన్ ఏర్పాటు అనేది నిబంధనలప్రకారం సక్రమంగా జరగలేదని ఆయన వ్యాఖ్యానించడం ముమ్మాటికీ పెద్ద తప్పు.
స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఏర్పాటుకు మూలమైన జీవోనెం-47 సీఐడీ చీఫ్ సంజయ్ కు కనిపించడంలేదా?
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ నిబంధనల ప్రకారమే ఏర్పడింది. అందుకు నిదర్శనం నాటి ప్రభుత్వం విడుదలచేసిన జీవోలే. ప్రభుత్వ అనుమతి లేకుండా జీవోలు ఎలా విడుదల చేస్తారో సంజయే చెప్పాలి. కార్పొరేషన్ ఏర్పాటులో ప్రధానమైన జీవో నెం – 47 ను నాటి హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ, ప్రస్తుత రాష్ట్ర ఎన్నిక ల కమిషనర్, మాజీ చీఫ్ సెక్రటరీ, అన్నింటికీ మించి ప్రస్తుత ముఖ్యమంత్రిగారికి అత్యంత సన్నిహితురాలైన శ్రీమతి నీలం సహానీ 10-09-2014న విడుదల చేశారు.
అదే నీలం సహానీ ఇప్పుటి జగన్ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించారు. గతంలో ముఖ్యమంత్రి ఆశీస్సులతో ఆమె చీఫ్ సెక్రటరీగా కూడా పనిచేశారు. చీఫ్ సెక్రటరీగా ఆమె పదవీకాలం ముగిశాక ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఏరికోరి ఆమెను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నియమించారు. జీవో నెం-47లో చాలా స్పష్టంగా ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు యొక్క ఆవశ్యకతను ప్రస్తావించారు. అలానే సదరు కార్పొరేషన్ కు సీ.ఈ.వో, మేనేజింగ్ డైరెక్టర్లను కూడా నియమిస్తున్నట్టు సదరు జీవో లో పేర్కొనడం జరిగింది.
విభజన వల్ల నష్టపోయిన రాష్ట్రం త్వరగా అభివృద్ధి చెందాలంటే, ఆర్థికంగా పురోభివృద్ధి సాధించాలంటే యువతకు నైపుణ్యాభివృద్ధి చాలా ముఖ్యమని, అందుకోసం స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం చాలా అవసరమని కూడా సదరు జీవో లో శ్రీమతి నీలం సహానీ పేర్కొన్నారు. జాతీయ నైపుణ్య శిక్షణాభివృద్ధి సంస్థ (ఎన్.ఎస్.డీ.సీ) ఏర్పాటు చేసిన విధంగానే ఏపీ.ఎస్.ఎస్.డీ.సీ ఏర్పాటుచేస్తున్నట్టు, మేనేజింగ్ డైరెక్టర్ గా శ్రీ గంటాసుబ్బారావుని, డైరెక్టర్ గా శ్రీ లక్ష్మీనారాయణను నియమిస్తున్నట్టు సదరు జీవోలో పేర్కొనడం జరిగింది. నీలంసహానీ సొంత సంతకంతో ఏర్పాటైన ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ పుట్టుకే అబద్ధమని సీఐడీ చీఫ్ సంజయ్ ఎలా చెబుతారు?
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఏర్పాటుకు అవసరమైన మెమొరాండం ఆఫ్ అసోసియేషన్ అండ్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ ను ఆమోదిస్తూ, నీలం సహానీ గారే జీవో నెం-48ను విడుదలచేసింది వాస్తవం కాదా?
జీవోనెం -47 తర్వాత జీవోనెం-48 27-09-2014న విడుదలచేశారు. ఏదైనా ఒక కార్పొరేషన్ పెట్టాలంటే రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ కు దరఖాస్తు చేయాలి. ఆ విధంగా చేసిన దరఖాస్తులో మెమొరాండం ఆఫ్ అసోసియేషన్ అండ్ మెమొరాండం ఆఫ్ ఆర్టికల్స్ ను పొందుపరుస్తూ రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ వారికి దఖలుపరచాలి. అటువంటి కీలకమైన మెమొరాండం ఆఫ్ అసోసియేషన్ అండ్ ఆర్టికల్స్ ను నీలం సహానీ గారు స్వయంగా ఆమోదిస్తూ జీవో నెం-48 విడుదల చేయడం జరిగింది. జీవోనెం – 47 జీవోనెం-48.. ఈ రెండు జీవోల్లో ఇంత స్పష్టంగా ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు యొక్క సమాచారం ఉంటే, ఎందుకు సీఐడీ ఆ జీవోలను తొక్కి విషప్రచారం చేస్తోంది?
వంకర ఆలోచనలతో దొడ్డిదారుల్లో టీడీపీప్రభుత్వం పనిచేయదు అని చెప్పడానికి ఈ రెండు జీవోలే నిదర్శనం. ఏపీ సీఐడీకి నిజంగా ధైర్యముంటే రెండు జీవోలు విడుదలచేసిన నీలం సహానీని ఎందుకు విచారించలేదు? ఆమెను విచారిస్తే ఏ విధంగా ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఏర్పాటైందో చాలా స్పష్టంగా సీఐడీకి వివరిస్తారు. కార్పొరేషన్ ఏర్పాటుకు సంబంధించిన జీవోలు ఇచ్చింది శ్రీమతి నీలం సహానీ అయితే, కార్పొరేషన్ ఏర్పాటుకు అవసరమైన నిధులు కేటాయించింది అజయ్ కల్లం రెడ్డి. వాళ్లిద్దరినీ ఇంతవరకు ఏపీ సీఐడీ విచారించలేదు? వారి వాంగ్మూ లం తీసుకోకుండానే చంద్రబాబు ప్రభుత్వం కార్పొరేషన్ ఏర్పాటు రూల్స్ ప్రకారం జరగలేదని సీఐడీ ఎలా చెబుతోంది.. ఏ అధారాలతో చెబుతోంది?
రాష్ట్రప్రభుత్వ పరిధిలో జరగాల్సిన ప్రక్రియ అంతా నిబంధనల ప్రకారం జరిగాక, ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఏర్పాటును ధృవీకరిస్తూ గవర్న మెంట్ ఆఫ్ ఇండి యా మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ వారు ధృవీకరణ పత్రాన్ని అక్టోబర్ 07, 2014న విడుదలచేశారు. సెప్టెంబర్ 10, 2014న నీలంసహానీ జీవోనెం-47 ఇచ్చాక, ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు ప్రక్రియ మొదలయ్యాక, కార్పొరేషన్ యొక్క ఆర్టికల్స్ ను ఆమోదిస్తూ జీవోనె-48 సెప్టెంబర్ 27, 2014న విడుదల చేశారు.
ఆ రెండు జీవోలు ఇచ్చాకే, వాటికి అనుగుణంగా అక్టోబర్ 7న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఏపీ ప్రభుత్వానికి ఇన్ కార్పొరేషన్ సర్టిఫికెట్ వచ్చింది. ఇదంతా పద్ధతి ప్రకారం జరిగితే, సీఐడీ చీఫ్ సంజయ్ ఇవేవీ బయటపెట్టకుండా స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ సక్రమంగా, పద్ధతిప్రకారం ఏర్పాటు కాలేదని ఎలా చెబుతారు?
టీడీపీ నేడు బయటపెట్టిన జీవోలపై గానీ, గతంలో బయటపెట్టిన 35 డాక్యుమెంట్లపై గానీ బహిరంగచర్చకు వచ్చే దమ్ము, ధైర్యం సీఐడీకి, ముఖ్యమంత్రికి ఉన్నాయా?
ఈ విధంగా అన్ని ఆధారాలు స్పష్టంగా కనిపిస్తున్నా, కేవలం చంద్రబాబు నాయుడిని వేధించాలన్న దురుద్దేశంతో, శునకానందం పొందడానికే వైసీపీ ప్రభుత్వం ఆయన్ని డఅన్యాయంగా జైలుకు పంపింది. ఏపీ సీఐడీని ఛాలెంజ్ చేస్తున్నాం. ఇప్పుడు మేం బయటపెట్టిన జీవోల సమాచారంపై గానీ, అంతకుముందు విడుదలచేసిన 35 డాక్యుమెంట్లపై గానీ, ప్రజలమధ్యలో బహిరంగంగా చర్చించే దమ్ము, ధైర్యం ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి, అతని జేబు సంస్థ అయిన సీఐడీకి ఉన్నాయా అని సవాల్ చేస్తున్నాం.
నీలంసహానీని విచారించే దమ్ము, ధైర్యం ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ కు ఉందా? జగన్ రెడ్డి ఏరికోరి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నియమించుకున్న సదరు అధికారిణిని విచారిస్తే సంజయ్ కు వాస్తవాలు తెలుస్తాయి. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఏరకంగా ఏర్పాటైందో, దానికి అనుగుణంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ కార్పొరేషన్ ఏరకంగా ఇచ్చిందో నీలంసహానీని విచారిస్తే ఆమే చెబుతారు. అలానే కార్పొరేషన్ ఏర్పాటుకి అవ సరమైన నిధులు ఏరకంగా విడుదలచేసింది అజయ్ కల్లం రెడ్డి చెబుతారు?
వారిద్దరినీ విచారించిన తరువాత సీఐడీ చీఫ్ మాట్లాడితే బాగుంటుంది. నీలం సహానీ, అజయ్ కల్లం రెడ్డి, ప్రేమచంద్రారెడ్డి.. ఇలా స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు, దాని అమల్లో కీలక పాత్ర పోషించిన వాళ్లను సీఐడీ విచారించదు. కానీ చంద్రబాబు తప్పు చేశాడని మాత్రం నిస్సిగ్గుగా దుష్ప్రచారం చేస్తుంది. స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ పుట్టుకే సరిగా లేదని చెబుతున్న సీఐడీ వ్యాఖ్యలన్నీ పచ్చి అబద్ధాలే అనడానికి మేం బయటపెట్టిన ఈ సమాచారమే నిదర్శనం. సీఐడీ వ్యాఖ్యల్లో ఒక్కశాతం కూడా నిజం లేదు అనడానికి జీవోలు 47, 48లు, గవర్న్ మెంట్ ఆఫ్ ఇండియా వారు ఇచ్చిన ఇన్ కార్పొరేషన్ సర్టిఫికెట్టే నిదర్శనం.
సీఐడీ చీఫ్ మనరాష్ట్ర రాజధాని, పొరుగు రాష్ట్ర రాజధాని మరియు దేశరాజధానిలో కూడా ప్రెస్ మీట్లు పెట్టి దుష్ప్రచారం చేయడం అయిపోయింది. ఇక మిగిలింది చంద్రమండలం ఒక్కటే, అక్కడికెళ్లి చెప్పినా, ఎక్కడికెళ్లి చెప్పినా చంద్రబాబుపై పెట్టిన కేసు పూర్తిగా రాజకీయ కక్షపూరితమేనని దానిలో వీసమెత్తు కూడా నిజం లేదన్న విషయాన్ని కప్పిపుచ్చలేరు. ఈ వాస్తవం ఇప్పటికైనా సీఐడీ చీఫ్ గ్రహిస్తే మంచిది. ఏఏపీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వ్యాఖ్యలు విన్నాక కామెడీ నటులు కూడా ఆయన ముందు దిగదుడుపేనని అర్థమైంది.
ముఖ్యమంత్రి అయిన వెంటనే లక్షలాది యువత జీవితాలు బాగుచేయడం కోసం చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే, జగన్ రెడ్డి ప్రజావేదికను కూల్చి, రాష్ట్రంలో ఇసుక దొరక్కుండా చేసి లక్షలాది నిర్మాణ రంగ కార్మికుల కుటుంబాలను రోడ్డుపాలుచేశాడు
విభజనానంతర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన మొదటి మూడు, నాలుగు నెలల్లోనే చంద్రబాబు రాష్ట్రాభివృద్ధికి అవసరమైన స్కిల్ డెవ లప్ మెంట్ కార్పొరేషన్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఆయన ఆలోచనలు ఎంత సమర్థవంతంగా, భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని అమలవుతాయో చెప్పడానికి స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఏర్పాటే నిదర్శనం.
చంద్రబాబు ఆలోచనలు అలా ఉంటే, జగన్ రెడ్డేమో ముఖ్యమంత్రి అయిన మొదటి నెలలోనే ప్రజావేదిక కూల్చాడు. రెండు, మూడు నెలల్లోనే ఇసుక దొరక్కుండాచేసి లక్షలాది కుటుంబాలను రోడ్డుపాలు చేశాడు . అయిదారు నెలల్లోనే ప్రజా రాజధాని అమరావతిని నాశనం చేశాడు. చంద్రబాబు, జగన్ రెడ్డి ల మధ్య ఉన్న వ్యత్యాసం ప్రజలు గ్రహించారు కాబట్టే, సైకో పాలనకు చరమగీతం పాడటానికి ఉవ్విళ్లూరుతు న్నారు.” అని పట్టాభిరామ్ స్పష్టంచేశారు.