-కొబ్బరినీళ్లిచ్చి అభిమానం చాటిన మస్తానమ్మకి తోపుడు బండి కానుక
యువగళం పాదయాత్రలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తనను కలిసిన ప్రతీ ఒక్కరి కష్టాలు, సమస్యలు వింటున్నారు. వినడమే కాదు, తనకు చేతనైనంత సాయం చేస్తూ మాటపై నిలిచిన బాటసారిగా నిలుస్తున్నారు. తాను నడుస్తూ వేలాది మంది తమ కాళ్లపై తాము నిలబడేలా సాయం అందిస్తూ వస్తున్నారు నారా లోకేష్.
ఇటీవల లోకేష్ పాదయాత్ర కాణిపాకం చేరింది. మస్తానమ్మ లోకేష్‌కి కొబ్బరి నీళ్లిచ్చి అభిమానం చాటుకుంది. స్వయంఉపాధి పొందుతూ ఆదర్శంగా నిలుస్తున్న మస్తానమ్మకి ఏదైనా సహాయం చేయాలనుకున్నారు లోకేష్. ఒక తోపుడు బండి ఉంటే కొబ్బరిబోండాలు అమ్ముకునేందుకు మరింత ఉపయోగంగా ఉంటుందని, తన సొంత డబ్బుతో బండి చేయించి కానుకగా పంపారు. ఐరాల మండల టిడిపి అధ్యక్షుడు గిరిధర్ బాబు,కాణిపాకం మాజీ సర్పచ్ మధు,మని నాయుడు, హరిబాబు, తవణంపలి మండల కన్వనర్ దిలీప్, ఖయ్యుమ్, అహ్మద్‌లు లోకేష్ పంపిన బండిని మస్తానమ్మకి అందజేశారు. తనకి బండి పంపిన నారా లోకేష్‌కి కృతజ్ఞతలు తెలిపింది మస్తానమ్మ.