అంగన్ వాడీల శిబిరాన్ని సందర్శించిన యువనేత లోకేష్

యలమంచిలి నియోజకవర్గం మునగపాకలో ఆందోళన చేస్తున్న అంగన్వాడీల శిబిరాన్ని యువనేత లోకేష్ సందర్శించి, సంఘీభావం తెలిపారు.ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ మరో 3 నెలల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత అంగన్వాడీల న్యాయబద్దమైన డిమాండ్లను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

అంగన్వాడీ సమస్యలకు పరిష్కారం చూపకపోగా, బెదిరింపుల ధోరణిలో మాట్లాడడం జగన్ నియంతృత్వ పోకడలకు నిదర్శనం.అంగన్వాడీ సెంటర్లను తెరవకపోతే సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లతో నడిపించుకుంటామని మంత్రులు వ్యాఖ్యలు చేయడం దుర్మార్గం.

2019 ఎన్నికల సమయంలో జగన్మహన్ రెడ్డి అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను గాలికొదిలేశాడు.టీడీపీ పాలనలో రెండు సార్లు అంగన్వాడీల గౌరవవేతనాన్ని పెంచాం. అంగన్వాడీలు న్యాయబద్ధమైన పోరాటానికి టీడీపీ అండగా ఉంటుంది.

Leave a Reply