-యువగళంలో పాల్గొని యువనేతతో ఆకుల విష్ణువికాస్ అనుబంధం
- చదువుకుని ప్రయోజకుడివి కావాలంటూ లోకేష్ ఉద్బోధ
– అన్నలా అండగా నిలుస్తానని లోకేష్ ఇచ్చిన భరోసాతో ఇంటికెళ్లిన విష్ణువికాస్
-ఇది నారా లోకేష్‌లో మరో కోణం
-ఇదే నాయుడిగారి అబ్బాయి అసలు సిసలు మానవత్వ రూపం
ఇది నారా లోకేష్‌లో మరో కోణం. ఇదే నాయుడిగారి అబ్బాయి అసలు సిసలు మానవత్వ రూపం. తన యువగళం పాదయాత్రలో పాల్గొంటూ వస్తున్న యువకుడు చదువుకి దూరం కాకూడదనే తపనతో నా తమ్ముడివి కదూ..అని అనునయించి, బుజ్జగించి కాలేజీకి పంపిన నారా లోకేష్ అన్నయ్య మనసు చాటుకున్నారు. సొంత తమ్ముళ్లు లేకపోయినా, పార్టీ అంటే ప్రాణం పెట్టే కుటుంబం నుంచి వచ్చిన ఆ పిల్లాడంటే లోకేష్‌కి తమ్ముడితో సమానం. ఆ అబ్బాయి పేరు ఆకుల విష్ణు వికాస్. ఊరు పెనుగొండ టౌన్. పెనుకొండ నియోజవర్గ కేంద్రం రామభద్రాలయం, తోటగిరి వీధిలో బలిజ సామాజికవర్గానికి చెందిన ఆకుల నరసింహులు ఎన్టీ రామారావు గారికి వీరాభిమాని. ఆయన భార్య పేరు నిర్మల. వీరి అబ్బాయే ఆకుల విష్ణువికాస్. ఎన్టీఆర్ పార్టీ పెట్టిన నుంచీ నరసింహులు కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అంటే సొంత కుటుంబం లెక్క. రాజకీయాల్లో లేడు, పదవులు ఆశించడు.
అయినా తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తూనే ఉంటుంది నరసింహులు కుటుంబం. తమ కొడుకు ఆకుల విష్ణు వికాస్ ఇంటర్(ఎంపీసీ) సెకండియర్ పరీక్షలు రాసిన అనంతరం లోకేష్ అన్న వెంట తానూ నడుస్తానని తల్లిదండ్రులకి చెప్పాడు. తెలుగుదేశం పార్టీ అంటే వల్లమాలిన అభిమానం ఉన్న ఆ తల్లిదండ్రులు అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకుని యువగళం పాదయాత్రకి తీసుకొచ్చారు.
అప్పటి నుంచీ తానూ వలంటీరుగా పాదయాత్ర బృందంలో చేరిపోయాడు. విష్ణువికాస్ ఇంకా మీ జిల్లా పాదయాత్ర అయిపోతుంది, ఇంటికి వెళ్లవచ్చని పెద్దలు చెబితే,“ నేను వెళ్లను..లోకేష్ అన్న వెంటే నడుస్తాను, జీవితాంతం ఆయన వెంటే ఉంటాను“ అంటూ మారాం ప్రారంభించాడు.
ఈ విషయం తెలుసుకున్న నారా లోకేష్ తనవద్దకి విష్ణువికాస్ ని పిలిపించుకున్నాడు. “తమ్ముడూ నేనంటే నీకెంత అభిమానమో నాకు తెలుసు. ఒక అన్నగా చెబుతున్నా నా మాట విను. నాపై అభిమానంతో యువగళంలో ఉండి చదువు దూరం చేసుకోకు. అమ్మానాన్నలు చెప్పినట్టు విను. చదువులు కొనసాగించు. నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఈ అన్నయ్య అండగా ఉంటాడు. నన్ను చూడాలనుకుంటే వారానికోసారి రా అంటూ నచ్చజెప్పడంతో అన్యమనస్కంగానే ఒప్పుకున్నాడు.
చదువు పూర్తయ్యాక తెలుగుదేశం కోసం మనం కలిసి పనిచేద్దాం“ అనే మాట విష్ణువికాస్‌కి బాగా నచ్చింది. అన్నింటికీ మించి తాను సొంత అన్నయ్యలా భావించే లోకేష్ తన చదువు-భవిష్యత్తు కోసం చూపించిన తపనతో వీడలేనంటూ..వీడుకోలంటూ యువగళం నుంచి కాలేజీ చదువు కోసం బయలుదేరాడు ఆకుల విష్ణువికాస్.