Suryaa.co.in

Andhra Pradesh

రాష్ట్రం కోసం, ప్రజల కోసం లోకేశ్ నిరంతర తపన

– ఓడిపోయిన చోటే రికార్డు మెజార్టీతో గెలిచి లోకేశ్ చరిత్ర సృష్టించారు
– లోకేశ్ పుట్టినరోజు సందర్భంగా కందుకూరులో మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేసిన మంత్రి డోలా, ఎమ్మెల్యే ఇంటూరి

కందుకూరు: మంత్రి నారా లోకేశ్ రాష్ట్రం కోసం, ప్రజల కోసం నిరంతరం పరితపిస్తున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. గురువారం నాడు లోకేశ్ పుట్టినరోజు సందర్భంగా.. తొలుత సింగరాయకొండలో కార్యకర్తలతో కలసి మంత్రి భారీ కేక్ కట్ చేశారు.

కందుకూరులో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుతో కలసి మంత్రి మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేసిన అనంతరం మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ….. మంత్రి నారా లోకేశ్ నిరంతరం రాష్ట్రం కోసం, ప్రజల కోసం పరితపిస్తున్నారు. గోల్డెన్ స్పూన్ తో పుట్టిన లోకేష్ ప్రజల కోసం ఎండా, వానల్లో తడుస్తూ రాష్ట్రమంతా యువగళం పాదయాత్ర చేశారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన చోటే రికార్డు మెజార్టీతో గెలిచి లోకేశ్ చరిత్ర సృష్టించారు.

కార్యకర్తల సంక్షేమ సారధిగా వారి కష్టాల్లో అండగా నిలుస్తున్నారు. మంత్రిగా విద్యా శాఖలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టి విద్యార్థుల బంగారు భవిష్యత్తుకి కృషి చేస్తున్నారు. మరో వైపు దేశ, విదేశాలు తిరిగి రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చి యువతకు ఉపాధి, ఉద్యోగాలు కల్పిస్తున్నారు.లోకేష్ ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు.

LEAVE A RESPONSE