Suryaa.co.in

National

రెండేళ్లలో ప్రపంచవ్యాప్తంగా డాటాసెంటర్ల సామర్థ్యం రెట్టింపు

– టెక్ హబ్ గా అవతరించబోతున్న విశాఖపట్నం
– భారత్ లో ఇండియా ఎఐ మిషన్ ద్వారా ఎఐలకు ప్రోత్సాహం
– ఎఐ ఎనర్జీ ఇంపాక్ట్ పై సదస్సులో మంత్రి నారా లోకేష్

దావోస్: భారతదేశం డేటా సెంటర్ సామర్థ్యం రాబోయే రెండేళ్ళలో రెట్టింపు అయి 2000 మెగావాట్లకు చేరుకోనుందని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఎఐ ఎనర్జీ ఇంపాక్ట్ అనే అంశంపై దావోస్ కాంగ్రెస్ హోటల్ లో జరిగిన సదస్సుకు మంత్రి లోకేష్ హాజరయ్యారు.

ఈ సదస్సులో ఎనర్జీ విజన్ (బెల్జియం) సిఇఓ మిచైల్ సెన్స్, ఆట్కిన్స్ రియలీస్ ప్రెసిడెంట్ లాన్ లెస్లీ ఎడ్వర్డ్స్ (కెనడా), మార్వెల్ ఫ్యూజన్ సిఓఓ హీక్ ఫ్రెండ్, షెల్ వైస్ ప్రెసిడెంట్ లాజ్లో వర్రో, నెబిఎస్ సిఇఓ ఆర్కడీ వోలోజ్ (నెదర్లాండ్స్), ఎమిరేట్స్ న్యూక్లియర్ ఎనర్జీ కార్పొరేషన్ సిఇఓ మహమ్మద్ అల్ హమాదీ, లిబర్టీ గ్లోబల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మ్యాన్యువల్ కొన్ స్టామ్, సాంబనోవా సిఇఓ రొడ్రిగో లియాంగ్, క్రోసో సిఇఓ చేజ్ లోచ్ మిల్లర్, మెయిన్ స్ప్రింగ్ ఎనర్జీ సిఇఓ షానోన్ మిల్లర్, కామన్ వెల్త్ ఫ్యూజన్ సిస్టమ్స్ సిఇఓ బాబ్ మంగార్డ్ తదితరులు పాల్గొన్నారు.

సదస్సులో లోకేష్ మాట్లాడుతూ… AI డేటా సార్వభౌమాధికారం, డేటా స్థానికీకరణపై దృష్టి ప్రపంచదేశాలు దృష్టిసారించడంతో సారించాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఎనర్జీ వినియోగంలో ప్రస్తుతం డాటా సెంటర్ల వినియోగం 1 నుంచి 2శాతం వరకు ఉంటుంది. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ (IEA) తన ఇటీవలి నివేదికలో డేటా సెంటర్ల నుండి విద్యుత్ డిమాండ్ 2030 నాటికి 233 టెరావాట్-గంటలు (TWh) ఉంటుందని అంచనా వేసింది, ఇది మొత్తం డిమాండ్ 6000 TWhలో 3-4% గా ఉంది.

ప్రస్తుతం డేటా కేంద్రాలు నిర్దిష్ట దేశాలు, ప్రాంతాలలో కేంద్రీకృతమై ఉండటంతో ఆ ప్రాంతాల్లో ప్రభావం గణనీయంగా ఉంది. ఐర్లాండ్‌లో మొత్తం అవసరంలో 17% ఎనర్జీని డాటా సెంటర్లు వినియోగిస్తున్నాయి. USA వర్జీనియా డాటా సెంటర్ క్యాపిటల్‌గా ఉంది, ఆ రాష్ట్రంలో 25% కంటే ఎక్కువ ఎనర్జీ వినియోగిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో డేటా సెంటర్‌లు ముఖ్యంగా హైపర్‌స్కేలర్‌లు మరింత శక్తి సామర్థ్యాలతో ఆకుపచ్చగా ఉండాలి.

డేటా సెంటర్ల శక్తి వినియోగాన్ని తగ్గించే దిశగా హార్డ్‌వేర్, HVAC నిర్వహణను మెరుగుపరచుకోవాల్సి ఉంది. డైనమిక్ వోల్టేజ్, ఫ్రీక్వెన్సీ స్కేలింగ్ (DVFS) వంటి పవర్ మేనేజ్‌మెంట్ టెక్నిక్‌లను ఉపయోగించాలి. ప్రభుత్వాలు డేటా సెంటర్లకు ఇచ్చే ప్రోత్సాహకాల్లో ఎనర్జీ సామర్థ్య భాగాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి.

భారతదేశంలో AI మార్కెట్ 2030 నాటికి USD 28.3 బిలియన్లకు పెరుగుతుంది, సగటున దాదాపు 28% వృద్ధి చెందుతుంది. భారత ప్రభుత్వం AI సామర్థ్యాన్ని గుర్తించి, ఇండియా AI మిషన్ అనే ప్రతిష్టాత్మక కార్యక్రమానికి బడ్జెట్ లో రూ. 10,300 కోట్లు (సుమారు. USD 1.2 బిలియన్లు) కేటాయించింది. AIపై దృష్టి సారించిన అనేక స్టార్టప్‌లు భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లోనే విశాఖపట్నం ఇంటర్నెట్ సీ కేబుల్స్‌తో పాటు డేటా సెంటర్లు, ఏఐ, ఇతర డీప్ టెక్ వెంచర్‌లతో విశాఖపట్నం కొత్త టెక్ హబ్‌గా అవతరిస్తోంది.

ఎఐ ప్రాధాన్యతను గుర్తించిన ఎపిలోని విద్యార్థులకు 7 నుంచి 9వతరగతి వరకు పాఠ్యాంశాల్లో ఎఐని త్వరలో ప్రవేశపెట్టబోతున్నాం. వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, సుస్థిరత, స్కిల్ డెవలప్ మెంట్, స్టార్టప్ ఎకో సిస్టమ్ వంటి రంగాల్లో ఎఐ అప్లికేషన్లను అందించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం గూగుల్ తో ఒప్పందం చేసుకుంది. దేశంలోనే తొలి ఎఐ యూనివర్సిటీ ఎపిలో ఏర్పాటు కాబోతోందని మంత్రి లోకేష్ చెప్పారు.

LEAVE A RESPONSE