Suryaa.co.in

National

ఉబర్, ఓలా సంస్థలకు నోటీసులు

యాప్ ఆధారిత క్యాబ్ సర్వీస్ ఉబర్, ఓలా సంస్థలకు కేంద్ర వినియోగదారుల మంత్రిత్వ శాఖ నోటీసులు ఇచ్చింది. ఈ తరహా యాప్‌లు ఫోన్ ధరను బట్టి ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు చాలా రోజులుగా ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఆరోపణలపై వివరణ ఇవ్వాలంటూ ఈ రెండు సంస్థలకు వినియోగదారుల మంత్రిత్వ శాఖ నోటీసులు ఇచ్చింది. ఒకే సర్వీసుకు ఈ రెండు సంస్థలు వేర్వేరు ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. ఒకే సర్వీసుకు రెండు వేర్వేరు ధరలు ఎలా నిర్ణయిస్తున్నారో వివరణ ఇవ్వాలని, ధరల్లో వ్యత్యాసం ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతోందని కేంద్ర వినియోగదారుల రక్షణ సంస్థ పేర్కొంది. ఛార్జీల విషయంలో నిజాయతీ, పారదర్శకత తీసుకువచ్చేందుకు సరైన వివరణతో రావాలని పేర్కొంది.

LEAVE A RESPONSE