Suryaa.co.in

Andhra Pradesh Telangana

మంచి స్నేహితుడిని కోల్పోయాను: కేటీఆర్

ఉన్నత విద్యావంతుడు.. వివాద రహితుడు.. వారం రోజులు దుబాయ్‌ ఎక్స్‌పోలో ఏపీకి పెట్టుబడులు తీసుకొచ్చిన మంత్రి.. ఉన్నట్టుండి గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. ఏపీ మంత్రి గౌతమ్‌ రెడ్డి మరణం షాక్‌కు గురిచేసిందన్నారు. మంచి స్నేహితుడిని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. గౌతమ్‌రెడ్డి పార్థివ దేహానికి నివాళులర్పించారు కేటీఆర్‌.ఆయ‌న‌ ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని ప్రార్థిస్తున్నాన‌న్నారు. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు కేటీఆర్ సానుభూతి తెలిపారు. గత 10 నుంచి 12 ఏళ్లుగా గౌతమ్‌రెడ్డితో తనకు పరిచయం ఉందని… రాజకీయంగా, వ్యక్తిగతంగా ఎన్నోసార్లు కలుసుకున్నామని చెప్పారు. ఇటీవలే 50వ పుట్టినరోజును జరుపుకున్న గౌతమ్ అకాల మరణం బాధాకరమన్నారు. మిత్రుడి మరణంతో షాక్‌కు గురయ్యానని కేటీఆర్ అన్నారు.

LEAVE A RESPONSE